- Advertisement -
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి టెర్మినల్‌ను ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నా సిఎం రేవంత్.. ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. డ్రైపోర్టు ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నాని అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి, మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
- Advertisement -