- Advertisement -
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది.ఈ కల్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. తన సతీమణి గీతతో కలిసి స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున సిఎం రేవంత్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణ వేడుకలో సీఎం రేవంత్ దంపతులతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీతారాముల కల్యాణ వేడుకను తిలకించేందుకు ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా రామ నామస్మరణతో మార్మోగుతోంది.
- Advertisement -