- Advertisement -
ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా.. సిఎం ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణతో విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటరెడ్ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా అందిస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతికి శ్రీకారం చుట్టడం.. ఆ మహనీయుడు అంబేద్కర్ కు ఘన నివాళి అని సీఎం రేవంత్ అన్నారు.
- Advertisement -