Friday, January 10, 2025

పేదల హృదయాల్లో తడి ఆరని సంక్షేమ సంతకం వైఎస్:సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ సిఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పేదల హృదయాల్లో తడి ఆరని సంక్షేమ సంతకం, తెలుగు ప్రజల మనసుల్లో అభిమానపు ప్రతిరూపం’ డాక్టర్ వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళి అని సిఎం రేవంత్ తెలియజేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం, దివంగత నేత వైఎస్‌ఆర్ 2009 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ లో రచ్చబండ కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. నల్లమల్ల అడవిలో పావురాల గుట్ట వద్ద హెలికాఫ్టర్ కూలిపోవడంతో వైఎస్ మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News