Monday, November 18, 2024

కలిసి సాగుదాం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి సిఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై మంత్రి సీతక్క, ఎంపీపి బలరాంనాయక్ తదితరులతో కలిసి గురువారం సిఎం రేవంత్ సమీక్ష చేస్తున్న సమయంలో ఎపిలో టిడిపి విజయం ప్రస్తావన రాగానే చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని చంద్రబాబు నాయుడును సిఎం రేవంత్ రెడ్డి కోరారు.

164 సీట్లతో కూటమి సునామీ
ఇటీవల ఫలితాల్లో ఎపిలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించగా టిడిపి 135, జనసేన 21, బిజెపి 8 సీట్లలో గెలుపొంది మొత్తంగా 175 స్థానాలకు గాను 164 సీట్లతో కూటమి సునామీ సృష్టించింది. తెలుగుదేశం ఒక్కటే సొంతంగా 135 స్థానాలు గెలుచుకొని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేన పోటీ చేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. పది స్థానాల్లో పోటీ చేసిన బిజెపి కూడా కూటమి పార్టీల మద్దతుతో అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాలు ఖాతాలో వేసుకుంది. ఎసి అసెంబ్లీలో బిజెపి ఇన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే 12వ తేదీన చంద్రబాబు నాయుడు ఎపి సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతిస్తే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్తానని రేవంత్ రెడ్డి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News