మన ప్రచా ముగియడంతో నేటి నుంచి తాను ఏం చేయబోతున్నానో అన్న విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడి అందరినీ అలరించారు. విద్యార్థులతో కలిసి తాను ఫుట్ బాల్ ఆడిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన రేవంత్ రెడ్డి ‘నిన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. ఇక నేటి నుంచి మళ్లీ ప్రజాసేవకు సిద్ధం అవుతుండగా సెం ట్రల్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో యువ ఆటగాళ్లతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం జరిగింది. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ యువత భారత పతాకాన్ని ఎగురవేయడానికి ప్రోత్సహిస్తా’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడి గా గోల్ వేసేందుకు సిఎం రేవంత్ పరుగులు తీశా రు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండా ఫుట్ బాల్ ఆడారు. రేవంత్ రెడ్డితో పాటు ఎ మ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్సీయూ ఎన్‌ఎస్యూఐ యూనిట్, హె చ్సీయూ విద్యార్థులు ఫుట్ బాల్ ఆడారు.
ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ ఫహీం, టి శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి తిలకించారు. అంతకుముందు హెచ్‌సియూలో విద్యార్థులతో సిఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు వర్సిటీ సౌకర్యాలు, ఇతర అంశాల గురించి విద్యార్థులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రెడ్డి ఫుట్ బాల్ ఫ్లెయింగ్ వీడియోపై నెటిజన్లు స్పంది స్తూ క్రీడలపై మీరు చూపిస్తున్న ప్యాషన్ తెలంగా ణ యువకులకు గొప్ప సందేశం ఇస్తోంది. మిమ్మ ల్ని తరుచుగా ప్లే గ్రౌండ్‌లో చూడటానికి ఇష్టపడుతున్నామని ఓ నెటిజన్ రియాక్ట్ కాగా, మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ ‘రేవంత్ అన్న.. ఇంగ్లండ్ లో ఉన్న సిటీ ఆఫ్ మాంచెస్టర్ స్టేడియం (ఎతిహాద్ స్టేడియం)కు సమాంతరంగా హైదరాబాద్ లో ఓ ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించేందుకు చొరవ తీసుకోండి. ఈ స్టేడియం ఛాంపియన్స్ లీగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిర్మించండి. అలాగే భవిష్యత్‌లో ఎక్కువ మంది విద్యార్థులను ఫుట్‌బా ల్ ఆడేలా ప్రోత్సహించండి. యోగా విషయంలో నరేంద్ర మోడీ ప్రపంచానికి ఎలా మార్గదర్శకంగా నిలిచారో మీరు కూడా భవిష్యత్ చిన్నారులకు స్పూర్తిదాయకంగా ఉంటారని కామెంట్ చేశారు.
మరో నెటిజన్ స్పందిస్తూ ప్రస్తుతం పిల్లల్లో ఫుట్‌బాల్‌పై క్రేజ్ విపరీతంగా ఉంది. అయితే ఫుట్‌బాల్ ప్లే గ్రౌండ్లు/అకాడమీలు చాలా తక్కువగా ఉన్నాయి. మంచి కోచ్‌లతో అన్ని రకాల క్రీడలతో అనేక మై దానాలను నిర్మించాలని ఆయన సిఎంను కోరారు.
సతీసమేతంగా కొడంగల్‌కు వెళ్లిన సిఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఆదివారం సాయంత్రం కొడంగల్‌కు వెళ్లారు. నేడు ఆయన కొడంగల్లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్‌కు సిఎం రేవంత్ వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.