Friday, December 20, 2024

పదేండ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గత బిఆర్ఎస్ సర్కార్.. పదేండ్లలో వందేళ్ల విధ్యంసం చేసిందని ఫైర్ అయ్యారు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులు ఉద్యమంలో కీలకంగా ఉన్నారని.. వారికి ప్రమాద బీమాను కోటి రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. బ్యాంకులతో ఎంఓయూ చేసుకున్నామని తెలిపారు. గత పాలకులు సింగరేణిని ప్రవేటు పరం చేసే కుట్ర చేశారని ఆరోపించారు.

సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “మనం బ్యాంకులకు కట్టాల్సిన అప్పే రూ.70వేల కోట్లు ఉంది. మిగలు రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ధనదాహానికి బలైన ప్రాజెక్టులను ఏం చేయాలో అర్థం కావడంలేదు. కుంగిన మేడిగడ్డను ఎలా బాగు చేయాలో సలహా ఇవ్వరు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు పెడ్తాం.. చర్చించేందుకు బిఆర్ఎస్ నేతలు సిద్ధమా?. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. బిఆర్ఎస్, బిజెపి కలిసి కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయి. స్వార్థం కోసం బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణను అంధ్రావాళ్ల కంటే ఎక్కువ విధ్యంసం చేసిన ఘనత కెసిరఆర్ దే. ఇంకా బిఆర్ఎస్ నేతలు అబద్దాలు చెప్పి.. ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనకు.. బిజెపి పాలనకు తేడా ఏముంది?. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సహకరించడంలేదు. హైదరాబాద్ వరదల్లో మునిగితే.. కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చాడు. మూడోసారి మోడీని ఎందుకు ప్రధానిని చేయాలి.. ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతులను కాల్చి చంపడానికా?” అని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News