Monday, December 23, 2024

ప్రజాపాలనకు @100 డేస్.. చరిత్ర సృష్టించాం: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు వద్దకు వెళ్లామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు రేపటికి వందరోజులు అవుతుందని శనివారం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పదేళ్లలో 100 సంవత్సరాలకు సరిపడా విధ్వంసం చేశారని సిఎం ఆరోపించారు. పరిపాలనను పదేళ్లలో బిఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. గతంలో సిఎం దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేది, ప్రస్తుతం మేం ప్రజల్లోనే ఉన్నామని సిఎం సూచించారు. 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని వెల్లడించారు.

మా 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తి నిచ్చిందన్నారు. అధికారంలో చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశామని సిఎం గుర్తుచేశారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించాని స్పష్టం చేశారు. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామన్నారు. బిఆర్ఎస్ టిఎస్ పిఎస్ సిని అవినీతికి అడ్డగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టిఎస్ పిఎస్ సిని ప్రక్షాళన చేపట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్ హామీ అమలులో భాగంగా 38 లక్షల జీరో బిల్లులు అందజేశామని సిఎం చెప్పారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేశామని పేర్కొన్నారు.

పన్ను ఎగవేత దారులపై కఠినంగా వ్యవహరించి.. ఆదాయాన్ని స్థిరీకరించామన్నారు. సచివాలయం వద్ద గత ప్రభుత్వ నిషేధాజ్ఞలు విధించిందన్న సిఎం ప్రస్తుతం సచివాలయం వద్ద ఆంక్షలు తొలిగించామన్నారు. సచివాలయంలోకి వచ్చే స్వేచ్ఛను అందిరికీ కల్పించామని సిఎం స్పష్టం చేశారు. తమ 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News