Thursday, January 23, 2025

తెలంగాణకు రావాల్సిన నీటీ వాటాను కెసిఆర్ ఆంధ్రాకు అప్పజెప్పాడు: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎపి ప్రభుత్వం రోజుకు 12 టిఎంసిల నీటిని దోచుకుంటుందని…దీనికి ముఖ్య కారకుడు మాజీ సిఎం కెసిఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగన్ తో కెసిఆర్ కుమ్మక్కు కావడంతోనే తెలంగాణ కృష్ణా నీటి ప్రాజెక్టులు ఎడారిగా మారాయన్నారు. పోతిరెడ్డిపాడు నీటి దోపిడీ ప్రారంభించనప్పుడు బిఆర్ఎస్ నేతలే మంత్రులుగా ఉన్నారని… బోర్డుకు కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ అప్పజెప్పారని బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్ పై నెట్టే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

“2014లో కెసిఆర్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్రానికి అప్పగించేలా పునాది పడింది. చట్టం జరిగినప్పుడు కెసిఆర్ ఓటేసి ఆమోదించారు. బిఆర్ఎస్ నేతల ఆమోదంతోనే చట్టం జరిగింది. కృష్ణా నీటిలో 299 టీఎంసీలు సరిపోతాయని కెసిఆర్ సంతకం చేశారు. మనకు రావాల్సిన 50 శాతం వాటాపై కెసిఆర్ నోరు మెదపలేదు. తెలంగాణకు రావాల్సిన నీటీ వాటాను ఆంధ్రాకు కెసిఆర్ అప్పజెప్పాడు. కెసిఆర్ హయాంలోనే రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టులు మొదలయ్యాయి. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలింపుకు కెసిఆర్, హరీష్ రావులు సహకరించారు. ఆనాడు పదవుల కోసం కెసిఆర్, హరీష్ రావులు పెదవులు మూసుకున్నారు.

Also Read: తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు: ఉత్తమ్

వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారు. అప్పట్లో పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు కొట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తరలింపునకు జగన్ ప్రణాళిక వేశారు. శ్రీశైలం నీళ్లే కాదు.. బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ యత్నించారు. రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోవాలని జగన్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్రగతి భవన్ లో కెసిఆర్ తో జగన్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య కుదిరిన చీకటి ఒప్పందంలో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీలు ఎపికి తరలించడానికి కెసిఆర్.. జగన్ కు అనుమతిచ్చారు. ఆ తర్వాత 2020, మే 5న నీటి తరలింపుకు జగన్ జీవో ఇచ్చారు. కమీషన్ల కోసం జగన్ తో కెసిఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తికి కెసిఆర్ ధనదాహమే కారణం. 2004 నుంచి 2023 వరకు అన్ని కుట్రల్లో కెసిఆర్ భాగం ఉంది” అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News