Monday, December 23, 2024

అడిగినవి ఇవ్వకపోతే.. చాకిరేవే..

- Advertisement -
- Advertisement -

మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా

మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని
కలిశా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే
వినతిపత్రం ఇచ్చా సహకరించకపోతే
మోడీనైనా ఉతికి ఆరేస్తా మా ప్రభుత్వం
జోలికి వస్తే పాలమూరు బిడ్డలు నిప్పు
కణికలై మానవబాంబులై పేలుతరు
2034 వరకు మా ప్రభుత్వమే ఉంటది
నాకు వయసూ ఉంది..ఓపికా ఉంది..
ఎవరైనా తోక ఝాడిస్తే కత్తిరించే కత్తెర
కూడా నా జేబులో ఉంది కేడి, మోడీ
ఏమీ పీకలేరు మా ప్రభుత్వంపై
ఎందుకు కక్ష? పాలమూరు నుంచి
ఎంపిని చేస్తే పదేళ్లు ఏం చేశావు?
బిఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి
పాలమూరు ప్రజాదీవెన బహిరంగసభలో
గర్జించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఎంఎల్‌సిగా మన్నె జీవన్ రెడ్డిని
ప్రకటించిన సిఎం

మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో : తాము అడిగినవి ఇవ్వకుంటే చాకిరేవు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ప్ర జా దీవెన బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిఎం ఇటు బిఆర్‌ఎస్, అటు కేంద్రంలోని బిజెపి ప్ర భుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆ యన చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తెలంగాణ ప్రజల ఆ కాంక్షల మేరకు ఇక్కడి అభివృద్ధి పనులకు ని ధులు ఇవ్వకపోతే ప్రధాని నరేంద్రమోడీని సైతం ఉతికి ఆరేస్తానని రేవం త్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో మెట్రో విస్తరణకు, మూ సీనది సుందరీకరణకు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం పిఎంను కలిసి వి నతిపత్రం ఇచ్చానని తెలిపారు. ‘సన్యాసులు బిజెపిలో కలుస్తారని చెబుతున్నారు.. మీలాగా ఇంట్లో తలుపులు వేసుకొని కాళ్ల్లు పట్టుకొని చెవిలో చెప్పలేదని, సభలోని అందరిముందు వినతిపత్రం ఇచ్చా ను’ అని పరోక్షంగా కెసిఆర్‌ను ఉద్దేశించి అ న్నారు.

అతిథులు మన ఇంటికి వస్తే ఎలా మ ర్యాద ఇస్తామో ప్రధానికి అలా గౌరవం ఇచ్చానన్నారు. మోడీ తెలంగాణ కు నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రానికి సహకరించకపోయినా తానే దేశమంతా తిరిగి మోడీని ఉతికి ఆరేస్తానన్నారు. ‘ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల పూర్తి కాకముందే ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని ఇక్కడి కెడి, అక్కడ మోడీ కుట్రలు చేస్తున్నరు. ప్రజల చేతే ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నారు. కొడుకల్లారా.. మా ప్రభుత్వం జోలికొస్తే ఖబడ్దార్… పేగులు తీసి ఊరేగిస్తా’ అని నిప్పులు చెరిగారు. ‘45 శాతం తెలంగాణ ప్రజలు ఓట్లేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడి కేడి, కేంద్రంలోని మోడీ కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నారు…మేం ఏమి చేశాం. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో వందేళ్ల విధ్వంసం జరిగింది.

ఇప్పుడిప్పుడే సమస్యల నుంచి తెలంగాణాను బయటికి తెస్తున్నాం.. పగలనకా…రాత్రినకా నిద్ర లేకుండా నేను, మా మంత్రులు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం..జ్యోతిరావు ప్రజాభవన్‌లో ప్రతిరోజు ప్రజల వినతి పత్రాలు తీసుకుంటు న్నాం. మేము ఎవరికైనా అన్యాయం చేసినమా? ఇక్కడ కెసిఆర్ పదేళ్లు పాలన చేయెచ్చు. ఢిల్ల్లీలో మోడీ పదేళ్లు దర్బార్ చెయ్యెచ్చు. ఇక్కడ ప్రజల తీర్పుతో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరంట..ఇదెక్కడి న్యాయం’ అని నిలదీశారు. ఏ ఉద్దేశ్యంతో కెడి, మోడీ కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చుతారని ప్రశ్నించారు.

యువత, మేధావి, విద్యార్థులారా ఆలోచించండి..ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చే దుర్మార్గపు రాజకీయాలకు పాతరేయాలని పిలుపునిచ్చారు. ‘పాపం కెసిఆర్ తన కుమారుడు సిఎం కావాలని కలలు కన్నాడు. కుదరలేదు. ఒక బక్క యువకుడు సిఎం అయ్యాడని ఓర్వలేక పోతున్నాడు. పాలమూరు నల్లమల్ల బిడ్డ సిఎం కాకూడదా? మేము తెలంగాణ కోసం పోరాటం చేయలేదా? ఉద్యమాలు చేయలేదా? పాలమూరు బిడ్డల మంచితనాన్ని చేతకానితనం అనుకున్నావా? వీరికేం తెలుసు వలసలు పోతారు.. వీరికి రాజకీయం ఎందుకు అనుకున్నావా? కొడకల్లారా ..మా బిడ్డలను టచ్ చేసి చూడండి.. మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై..మానవ బాంబులై పేలుతారు…నా కొడకల్లారా ..ఇంకా ఎవరైనా మిగిలితే నేను చూస్తాం. వాడినో, వీడినో సంకలో పెట్టుకొని ..ఏదో చేద్దామనుకుంటే ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పేగులు తీసి ఊరేగిస్తా’ అని రేవంత్ తీవ్ర స్థ్దాయిలో హెచ్చరించారు. కరీంనగర్ నుంచి బేకార్‌గాన్ని పాలమూరు ఎంపిగా గెలిపిస్తే పదేళ్లు పాలమూరుకు ఏమి చేశావని ప్రశ్నించారు.

పార్టీలను చీల్చడం, పడగొట్టడం నీతి, జాతినా అని మండిపడ్డారు. కాంగ్రెస్ జోలికి వస్తే నల్లమల్ల నుంచి తొక్కుకుంటూ ఈడ్చేస్తానని అన్నారు. ‘మేం వలసలు పోయినోళ్లమే కాదని, నీలాంటి వాళ్లని బొందబెడతాం’ అని హెచ్చరించారు.తమ పార్టీని కూల్చుతామంటే ఊరుకుంటా మనుకుంటున్నారా? మీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసన్నారు. ఇక్కడ కేడి, అక్కడ మోడీ ఎన్ని కుట్రలు చేసినా 2034 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రోజమ్మ పులుసు తిని ఆంధ్రాకు నీళ్లిచ్చారు
బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కెసిఆర్ ఆంధ్ర మంత్రి రోజమ్మ నాటు కోడి పులుసు తిని ఆంధ్రాకు నీళ్లిచ్చి తెలంగాణకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డి పాడు, మల్యాల నుంచి ఆంధ్రాకు నీళ్లును తీసుకెళ్తుంటే ఈ దద్దమ్మ ఏమి చేశాడని నిలదీశారు. తాము తెలంగాణకు జరిగిన ఆన్యాయంపై పోరాడుతుంటే కాళ్లు లాగుతున్నారని విమర్శించారు. ‘నేను మీలాగా తాగుబోతుని కాదు.. నేను ఎప్పుడూ జోష్‌లోనే ఉంటాను’ అన్నారు. ‘కృష్ణా నది జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది నీవు కాదా’ అని పరోక్షంగా కెసిఆర్‌ను నిలదీశారు.

90 రోజుల్లో రెఫరెండం సిద్ధం
90 రోజుల్లో రెఫరెండంకు మీరు సిద్ధమా అని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాక ముందే ప్రజలికిచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదింటిని అమలు చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్‌టిసిలో మహిళలకు ఉచిత ప్రయాణం, పది లక్షలకు ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు 500 వందలకే గ్యాస్ , రెండు రోజుల్లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రూ. 5 లక్షల ఉచిత ఇళ్లు ఇస్తామన్నారు.

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తున్నామన్నారు. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోలిచ్చామని సిఎం చెప్పారు. డిఎస్‌సి ద్వారా మరో 11 వేల ఉపాధ్యాయు ఉద్యోగాలను భర్త్తీ చేస్తామన్నారు. దళితులు, ఎస్‌టి, తండాలు, గామాల్లో పేదల పిల్లలకు విద్యనందించేందుకు ఉపాధ్యాయులను భర్తీ చేస్తామన్నారు. గ్రూప్= 1 కింద 563 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. బిఆర్‌ఎస్ అంటే బిర్లా రంగా సమితి అని అభివర్ణించారు అన్నారు. కెటిఆర్, హరీష్‌రావుల సమితి పార్టీగా మారిందన్నారు.

పచ్చని పాలమూరును చేస్తా
రానున్న కాలంలో పచ్చని పాలమూరుగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్‌డిఎస్ కోసం కుర్చీ వేసుకొని కూర్చుంటానని, తుమ్మిళ్ల ఎతిపోతల నీళ్లిస్తానని, పాలమూరు రంగారెడ్డి నీళ్లిస్తానని చెప్పి పచ్చి మోసం చేశారని సిఎం ఆరోపించారు. పాలమూరు ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. పాలమూరుకు గత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల, సంగంబండ నీళ్లు వస్తున్నాయన్నారు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.

ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉప చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి పాలమూరును పచ్చని పాలమూరుగా మార్చుతానని హామీ ఇచ్చారు. పాలమూరు తనకు రాజకీయ భిక్షనిచ్చిన గడ్డని కొనియాడారు. ‘జడ్‌పిటిసి, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఎ, ఇవాళ సిఎం వరకు అవకాశం వచ్చందటే మీరిచ్చిన రాజకీయ భిక్ష’ అని సిఎం అన్నారు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ‘నాకు తాతల, పెద్దల ఆస్తులు లేవు… నాన్న పెట్టిన రాజకీయ భిక్ష కాదు. ప్రజలకు ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని.. మీ కష్టాలు తెలిసిన వాడిని.. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా’ అని హామీ ఇచ్చారు.

రెండు పార్లమెంట్ సీట్లను గెలిపించండి
మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎంపి సీట్లను గెలిపించాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి కోరారు. ఎంఎల్‌సి స్థానిక సంస్థల నుంచి మన్నె జీవన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో జీవన్ రెడ్డిని, ఎంపిగా చల్లాను గెలిపించాలని ఆయన కోరారు. నల్లమల బిడ్డగా మీరిచ్చే బహుమతి ఇదేనని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News