Monday, December 23, 2024

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీని సిఎం మర్యాదపూర్వకంగా కలిశారు. రంజాన్ వేడుకల్లో పాల్గొని అనంతరం విందు ఆరగించారు. సిఎం వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డి ఉన్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు వినిపిస్తున్నాయి. మీర్ అలం, ఈద్గా, చార్మినార్, మక్క మసీద్ లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News