Wednesday, January 29, 2025

యాదగిరిగుట్టకు చేరుకున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డలు చేరుకున్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

యాదాద్రి ఆలయంలో సిఎం రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామిని సతీసమేతంగా రేవంత్ దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లకు రేవంత్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సిఎం దంపతులు, మంత్రులకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News