Wednesday, April 16, 2025

పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలి: సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి జరిగిన ప్రమాద వార్తపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రమాద ఘటనపై సిఎం రేవంత్ షాక్‌కు గురయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో సిఎం రేవంత్ పోస్ట్ చేశారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి, శంకర్ గాయాల పాలయ్యాడు.

గాయాలపాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: మంత్రి కొండా సురేఖ
అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టు చేశారు. పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురవ్వడం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు. గాయాలపాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కోరుతున్నానని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News