Sunday, December 22, 2024

ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదంపై స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సిఎం ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని సిఎం రేవంత్ జిల్లా అధికారులకు సూచించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News