మన తెలంగాణ/హైదరాబాద్ : ‘గేమ్ ఛేంజర్’ టి కెట్ ధరల పెంపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. టికెట్ ధరల పెంపు విషయంలో ఈ సినిమాకు ఇచ్చిన వెసులుబాటును ఉ పసంహరించుకుంటున్నట్టు ఈ మేరకు ఉత్తర్వు లు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు, అదనపు ఫోలకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రాష్ట్రం లో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్టా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చిత్రబృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ పర్భుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు, జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.