Wednesday, January 22, 2025

తెలంగాణ గీతాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2 ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ సర్కార్ వైభవంగా నిర్వహిస్తోంది.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆవిర్భావ సంబురాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి అందెశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News