Saturday, November 23, 2024

టెట్ 2024 ఫలితాలను విడుదల చేసిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

టీజీ టెట్ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టీజీ టెట్-2024 పేపర్-1కు 57,725 మంది అర్హత సాధించగా… పేపర్-2కు 51,443 మంది అర్హత సాధించారు. పేపర్-1లో 67.13శాతం.. పేపర్-2లో 34.18శాతం అర్హత సాధించారు. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు ప్రభుత్వం కల్పించింది. ఇక, టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

కాగా, గత మార్చి 15వ తేదీన టిజిటెట్ 2024 నోటిఫికేషన్‌ వెలువడగా.. పేపర్‌-1కు 99,958 మంది, పేపర్‌-2కు 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. మే 20వ తేదీన ప్రారంభమైన టెట్ పరీక్షలు జూన్‌ 2వ తేదీతో ముగిశాయి. పేపర్‌-1కి 86.03 శాతం మంది, పేపర్‌-2కి 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

తెలంగాణ టెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణ టెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News