Monday, December 23, 2024

చెల్లి పిలిచింది… అన్న వచ్చాడు!: మహిళ పిలుపుకి స్పందించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు సిఎం రేవంత్ యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లు, మంత్రుల బృందంతో కలసి ఆయన ఆస్పత్రిలోకి వెళ్తుండగా.. ‘రేవంత్ అన్నా’ అంటూ ఓ మహిళ పిలుపు వినిపించింది. అంతే, రేవంత్ గిరుక్కున వెనక్కి తిరిగి, చకచకా ఆ మహిళ దగ్గరకు వెళ్ళారు. ఏంటి సమస్య? అని అడిగారు. తన పాపకు ఒంట్లో బాగోలేదని, ఆస్పత్రిలో చేర్పిస్తే, చికిత్సకు చాలా ఖర్చువుతోందని ఆమె మొరపెట్టుకున్నారు. వెంటనే ఆమె సమస్యకు ఓ పరిష్కారం చూపాలని సిఏం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News