Sunday, February 23, 2025

ధరణిపై ముగిసిన సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ధరణిపై సిఎం సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా పాల్గొన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. నెలకు ఒకసారి మండల కేంద్రం రెవిన్యూ సదస్సులు నిర్వహించనుంది ప్రభుత్వం. ఎన్నికల్లో ధరణి రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News