- Advertisement -
హైదరాబాద్: రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై చర్చిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లో ఏడాదికి ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సీమీక్షిస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఖజానాలో మాత్రం నిధులు లేనట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో యాసంగికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఎలాగైన నిధులు సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.
- Advertisement -