- Advertisement -
రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, వేం నరేందర్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణ పోరాటం, అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నాన్ని రూపొందితస్తున్నారు. ఇక, రాష్ట్ర గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు కీరవాణి తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లోనే తెలంగాణ గీతం, లోగోను ఆవిష్కరించనున్నారు.
- Advertisement -