Monday, December 23, 2024

నాణ్యతలో రాజీపడొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూ లింది.. గత ప్రభుత్వంలోరూ.1.40లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అయింది ..కూలటం అయింది రెండు జరిగాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వ రం ప్రాజెక్టునిర్మాణంలలో డిజైన్లలో లోపాలు నాసిరకం పనులు అవినీతి అక్రమాలను ఎండగట్టారు. కాళేశ్వరంపై జరుగుతున్న కమిషన్ విచారణకు హాజరవుతున్న వారివద్ద కమిషన్ అడిగినే ప్రశ్నలకు సమాధానాలు లేవు..ఇంత ఖ ర్చు చేసి కూడా 52వేల ఎకరాలకు మించి నీరివ్వలేకపోయారని విమర్శించా రు. ఎందుకు కాళేశ్వరంలో ఇటు వంటి తప్పులు జరిగాయి..తప్పు ఎవరిది. ఈఈసిఈ ఈఎన్సీలదా..దీన్ని యువ ఇంజనీర్లు మోడల్ స్టడీస్‌గా తీసుకొం డి..తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖలో సగం మంది కాళేశ్వరం ప్రాజెక్టులోఉన్న వారే .. వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తే నీటిపారుదల శాఖనే రద్దు చే యాల్సివుంటుందన్నారు. గురువారం జలసౌధ ప్రాంగంణంలో నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసిన కొత్త ఇంజనీర్ల నియామక పత్రాల అందజేత కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

నీళ్లు మన
సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు.. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్దతో ఇంజనీర్ల నియామకాల ప్రక్రియను నేరవేర్చారు.. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం.. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది..ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది..ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు..ప్రాజెక్టుల నిర్మాణాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే మీ నివేదికలే కీలకం ..రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు. పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే ఎమ్మెల్యేగా, పార్లమెంట్ మెంబర్‌గా సీఎం స్థాయికి వచ్చా.. అని ముఖ్యంమ్రంతి అన్నారు. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారని, ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారని తెలిపారు.కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారన్నారు.

తన పరిశీలనలో ఇంజనీర్లు ఫీల్డ్ విజిట్‌లకు వెల్లడం లేదని తేలిందన్నారు.తాము అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించామన్నారు. ఫీల్ఢ్ విజిట్‌కు వెల్లిన వారిని వారి సర్వీస్‌లో రిమార్క్‌లు రాయమని ఐఎఎస్ ,ఐపిఎస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయని , దీనికి ఎవరిని బాధ్యులను చేయాలి ..అధికారులనా ,రాజకీయ నాయకులనా .. మీరే చెప్పాలి అని యువ ఇంజనీర్లను ప్రశ్నించారు. అందుకే మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ అని సిఎం వెల్లడించారు. స్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్ మెంటే ఉండదని, చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని సిఎం వెల్లడించారు. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్‌ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదన్నారు.

గత పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి అని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం అని వెల్లడించారు. ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలన్నారు. రికమెండేషన్ తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి అని అధికారులకు వేదికపైనుంచే ఆదేశాలిచ్చారు. ఇంజనీర్లు పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్ ల మీద కాదు..అని సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు.

దేశ గొప్ప తనాన్ని చాటేవి కట్టడాలే అన్నారు. సాగునీటిశాఖ ద్వారా అందరం గొప్ప యజ్ణం చేయ్యాలన్నారు. ఈ ఐదు సంవత్సరాలు అంకితభావంతో పనిచేద్దామన్నారు. ఇంజనీర్లగా వృత్తిలో ఏవైనా సమస్యలు వస్తే పరిష్కారనికి సిద్దంగా ఉన్నామన్నారు. మీ అన్నగా తనవద్దకు ఎప్పుడైనా రావచ్చని యువ ఇంజనీర్లకు సూచించారు. వందరోజుల పాలనలోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అందరూ తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఎంపికైన 678మంది అసిస్టెంట్ ఎగ్జిక్యుటీవ్ ఇంజనీర్లకు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ,పొన్నం ప్రభాకర్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలి . దాస్ ,ఎమ్మేల్యే జగ్గారెడ్డి , కార్పోరేటర్ విజయారెడ్డి , అధికారులు రామకృష్ణారావు , బొజ్జా రాహుల్ ఈఎన్సీలు అనిల్ కుమార్ ,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News