Sunday, January 5, 2025

నిరుపేదలకే..తొలి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో
దివ్యాంగులు, వ్యవసాయకూలీలు,
పారిశుద్ధ కార్మికులకు పెద్దపీట
తొలివిడతలో సొంత స్థలాలు ఉన్న
వారికి అవకాశం ఇందిరమ్మ ఇళ్ల
మొబైల్ యాప్‌లో లోటుపాట్లు
లేకుండా చూసుకోవాలి
ఆదివాసీ, ఐటిడిఎ ప్రాంతాల్లో
ప్రత్యేక కోటా అదనపు గదుల
నిర్మాణానికి అనుమతి ఉన్నత
స్థాయి సమీక్షా సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ :ఇందిరమ్మ ఇ ళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రా ధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూ చించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు ఇ లా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సిఎం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స మీక్ష నిర్వహించారు. తొలి దశలో సొంత స్థలాలు న్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బా ధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అ ధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మొ బైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని అదే
సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సిఎం ఆదేశించారు.

ఆదివాసీ ప్రాంతాలు, ఐటిడిఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థమంతంగా కొనసాగించేం దుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్, ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News