Tuesday, April 29, 2025

మిస్‌ వరల్డ్‌ పోటీలపై సిఎం రేవంత్ రివ్యూ.. అధికారులకు కీలక ఆధేశాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. మే 10న హైదరాబాద్ లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లపై అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన విషయాలు, ఏర్పాట్లపై సిఎం ఆరా తీశారు. ఈ పోటీల గురించి సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌వరల్డ్‌ పోటీలకు వస్తున్న వారికి అసౌకర్యం లేకుండా చూడాలని సూచించారు. విమానాశ్రయం, హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని.. అలాగే, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ భారీగా బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సిఎం రేవంత్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News