- Advertisement -
తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సమీక్షించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని సిఎం సూచించారు. ప్రజాసమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలని తెలిపారు. అధికారులు జవాబుదారీగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు ప్రజల మనసు గెలుచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నింటీని సహిస్తారు.. కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని హెచ్చరించారు. ఎంతటివారినైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు. ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సూచించారు.
- Advertisement -