Friday, January 3, 2025

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం.. ఖమ్మం బయల్దేరిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది.  ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించేందుకు రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయల్దేరి వెళ్లారు. అంతకుముందు వర్షాలపై ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం 5 కోట్లు మంజూరు చేశారు.

వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించాలని… వర్షాలతో జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సిఎం ఆదేశించారు. “భారీ వర్షాలు ఉన్న చోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని కలెక్టరేట్‌లలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలి. 8 పోలీస్‌ బెటాలియన్లకు ఎన్డీఆర్‌ఎఫ్‌ తరహా శిక్షణ ఇవ్వాలి” చెప్పారు. అలాగే, జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణమే సాయం అంధించాలని కేంద్రానికి సిఎం రేవంత్ లేఖ రాశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News