Friday, December 20, 2024

గొప్పలకు పోకుండా బడ్జెట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:హంగులు, ఆర్భాటాలు, గొప్పలకు పో కుండా రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించాలని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆర్థికశాఖాధికారులను ఆదేశించారు. ఎవ్వరినో మెప్పించడానికి గొప్పలకు పోయి బడ్జెట్‌ను రూపొందించవద్దని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనముందున్న సవాళ్ళు, లక్షాలను ఉన్నది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రజలకు చెబుదామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీ క్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వచ్చిందనుకొని 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన బడ్జెట్‌ను తయారు చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం, ఖర్చులకు సంబంధించి వాస్తవికతను ప్రతిబింభించేలా బడ్జెట్‌ను తయారు చేయాలని అన్నారు. దుబారా చేయకుండా, వృధా ఖర్చులను తగ్గించాలని సిఎం ఆదేశించారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత, ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చు ఎంత, అప్పులు, చెల్లించాల్సిన బకాయి లు, వడ్డీల చెల్లింపులు… ఇలా నెలసరి ఖర్చులన్నింటిపైనా స్పష్టత ఉం డాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ,

వ్యయాల ముఖచిత్రం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అంతేగానీ ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరిచే పనిలేదని, అలాంటి అవసరం కూడా లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని సిఎం అన్నారు. ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన గురుతరమైన బాధ్యత తమ ప్రభుత్వంపైనే ఉందని అధికారులకు గుర్తుచేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా రూపకల్పన చేయాలని కోరారు. గతంలో అప్పులను దాచిపెట్టి ఆదాయ వ్యయాలను బూతద్దంలో చూపించారని, ఇప్పుడు అలాంటి పనులు చే యాల్సిన అవసరం లేనేలేదని సిఎం అన్నారు. ఉన్నది ఉన్నట్లుగా ఆదా య స్థితిగతులను జనం ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని సిఎం కోరారు. తప్పనిసరయితే తప్ప ప్రభుత్వం తరుపున ఇచ్చే ప్రకటన లు తగ్గించాలని, కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా, ఇప్పుడున్న వాహనాలనే వినియోగించుకోవాలని సిఎం ఆదేశించారు. గత పాలకులు ఎన్నికల్లో గెలవకముందే 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేసిందని, ఒక్కొక్క వాహనం సుమారు మూడు కోట్ల రూపాయల వరకూ ధర ఉందని, అలా 22 వాహనాలను కొనుగోలు చేసిన విషయం ఈ సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువగా గ్రాంట్లను రాబట్టుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేయాలన్నారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్ద ని అధికారులను సిఎం అప్రమత్తం చేశారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో… లేక రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్షంగా బడ్జెట్ కసరత్తులు జరగాలని ము ఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క, ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, కార్యదర్శి టికె శ్రీదేవి, జాయింట్ సెక్రటరీ కె.హరిత, డిప్యూటీ సిఎం ఓఎస్డీ కృష్ణభాస్కర్ తదితర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News