Monday, January 6, 2025

సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలపై చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

నిన్న రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై సిఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై కూడా సిఎం చర్చలు జరిపారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని.. అందుకు సంబంధించిన విధవిధాలను రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. కాగా, ఈ నెల 18న తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News