Wednesday, January 22, 2025

పదేళ్లపాటు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పై చెయి వేస్తే మాడి మసైపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చారించారు. తాను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదని తెలుకో అని..ఇక్కడ కాపాలా ఉన్నది రేవంత్ రెడ్డి అని అన్నారు. లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో  శనివారం మెదక్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల కల్లల్లో ఆనందం చూడలేక.. కెసిఆర్ కండ్లలో నిప్పులు పోసుకుంటున్నాడని మండిపడ్డారు. కెసిఆర్ అల్లుడు హరీష్ రావు మెదక్ కు చేసిందేమీ లేదని.. సిగ్గులేకుండా అబద్దాలు మాట్లాడుతూ ఓట్లడుగుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలిస్తామని మోసం చేసిన మోడీని బండకేసి కొట్టాలన్నారు. మూడు రంగుల జెండాతోనే దేశంలో అభివృద్ధి జరుగుతుందని సిఎం చెప్పారు.

పదేళ్లుగా మోడీ, కెసిఆర్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు..ఈ ప్రాంతానికి మోడీ ఒక్క పరిశ్రమనైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులను చంపిన బిజెపిని ఎన్నికల్లో బొంద పెట్టాలన్నారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేడీ ఇద్దరు తోడుదొంగలని ఫైరయ్యారు.

రాష్ట్రంలో వచ్చే పదేళ్లపాటు ఇందిరమ్మ రాజ్యం.. ప్రజాపాలన ఉంటుందన్నారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఏకకాలంలో రూ.2లక్షల మాఫీ చేయడంతోపాటు వచ్చే సీజన్ నుంచి వరింపంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. మీ ఉత్సాహం చూస్తుంటే.. నీలం మధు ఈజీగా గెలుస్తాడని అనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News