Saturday, November 23, 2024

కెసిఆర్‌ను నమ్మితే.. నట్టేట మునిగినట్లే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్‌ను నమ్మితే నట్టేటముంచుడు ఖాయమని….బిడ్డకోసం సికింద్రాబాద్ సీటును తాకట్టుపెట్టి పద్మారావు పరువుతీసేందుకే పోటీకి దింపాడని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ కెసిఆర్‌ను నమ్మితే పద్మారావు నట్టేటమునిగినట్లేనని. ఈ సీటును బిడ్డకోసం బిజెపి తాకట్టు పెట్టాడని పేర్కొన్నారు. పద్మారావు నామినేషన్‌కు కెసిఆర్, కెటిఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే…కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

గత ఇరవై ఏళ్లుగా ఇదే జరుగుతోందని, మళ్లీ ఇదే పునరావృతం అవుతుందని….మహాంకాళీ అమ్మవారి ఆశీస్సులతో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తోందని, దానం నాగేందర్ కేంద్రప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారన్నారు. బిజెపి నాయకులు గెలిచి కేంద్ర మంత్రులైనా…హైదరాబాద్‌కు చేసింది ఏమిలేదని, వరదలు వచ్చి నగరం అతలాకుతలమైతే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి చిల్లిగవ్వ తేలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తిని ముస్లింలకు పంచుతారని మోదీ మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారని, ఒకరి ఆస్తులను ఇంకొకరికి ఎలా పంచుతారని మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోది ఇలా మాట్లాడటం సరైందికాదన్నారు. ఉద్యోగాలు, ఇండ్లు ఇస్తామని అధికారంలోకి వచ్చి బిజెపి మోసంచేసిందని దుయ్యబట్టారు.

బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్లే, బిజెపిని ఓడించాలంటే దానం నాగేందర్‌ను గెలిపించాలన్నారు. ప్రభుత్వం మనది…సంక్షేమం మనదని,ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యతమాదని సీఎం హామీ ఇచ్చారు. నగరంలో మెట్రో తెచ్చింది…నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి కృష్ణా,గోదావరి జలాలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. జంట నగరాల దాహార్తిని తీర్చింది ఎవరో చర్చ పెడదాం… కెటిఆర్ ఇందుకు సిద్దమా అని సవాల్ విసిరారు. రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్‌లు జోడెద్దుల్లా అండగా ఉండి అభివృద్ది చేస్తారని ,నాగేందర్‌ను లక్ష మెజారిటీతో గెలిసించాలన్నారు. ఎంపి అభ్యర్థి దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపిలు అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News