Sunday, December 22, 2024

పూరి బీచ్‌లో సిఎం రేవంత్ సైకత శిల్పం

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని ఆయన అభిమానులు నిర్ణయించారు. దీంతో జీవితంలో ఆయనకు గుర్తుండు పోయేలా ఓ కానుకను ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి వచ్చిన ఓ స్పెషల్ కానుక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ రేవంత్ రెడ్డి పట్ల వెరైటీగా తన అభిమానాన్ని చాటుకున్నారు. అందులో భాగంగా సైకత శిల్పాలకు ఫేమస్ అయిన ఒడిశాలోని పూరి బీచ్‌లో రేవంత్ సైకత శిల్పాన్ని వేయించి ఆయనకు బర్త్‌డే కానుకను అందజేశారు. బీచ్‌లో ఇసుకతో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని వేసి దానిపై హ్యాపీ బర్త్‌డే రేవంత్ అన్న, తెలంగాణ సిఎం అంటూ రాశారు. బెస్ట్ విషెస్ ఫ్రం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అంటూ అందులో పేర్కొన్నారు.

ఎక్స్‌లో వీడియో పోస్ట్
దీనికి సంబంధించి ఎక్స్‌లో ఓ వీడియోను కాంగ్రెస్ నాయకులు పోస్టు చేసి అందులో సిఎం రేవంత్ గురించి రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నేత అని, పదేళ్ల పాటు అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ను తిరిగి గద్దెనెక్కేలా చేశారని పలువురు సిఎం రేవంత్ అభిమానులు రాసుకొచ్చారు. టిపిసిసి అధ్యక్షుడిగా ఉంటూ దిగువ స్థాయి శ్రేణులను కూడా కలుపుకుంటూ పోతూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ పనిచేశారని వారు తెలిపారు. మొత్తానికి అనుకున్నది సాధించిన రేవంత్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News