Monday, March 31, 2025

ఆ ముగ్గురి మరణాలపై అనుమానాలు

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్‌లో మరణించారు
ర్యాడిసన్ బ్లూడ్రగ్స్ కేసులో ఆయన కీలక నిందితుడు కాళేశ్వరంపై
ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి, ఈ కేసు వాదించిన అడ్వకేట్
సంజీవరెడ్డి హత్యకు గురయ్యారు ఈ మరణాలపై కెటిఆర్
జుడీషియల్ ఎంక్వైరీ ఎందుకు అడగరు? సిఎం సంచలన వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ :సినీ నిర్మాత కేదార్ ఆకస్మిక మృతి పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, మరణించిన కేదా ర్ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షులు కేటీఆర్‌కు సన్నిహితులంటూ ఢిల్లీలో జరిగిన చిట్‌చాట్‌లో సీఎంరేవంత్‌రెడ్డి సంచలన వ్యా ఖ్యలు చేసారు. తెలంగాణలో ఇటీవల మూ డు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. వీరిలో ఒకరు కాళేశ్వరం ప్రాజెక్టు పై (మేడిగడ్డ) కేసులు వేసిన రాజలింగమూర్తి, రెండవది సినీ నిర్మాత కేదార్, మూడవది వీరిద్దరి కేసులను వాదిస్తున్న సంజీవరెడ్డి అనే అడ్వకేట్ అని సీఎం వివరించారు. దుబాయిలో అనుమానాస్పదంగా మరణించిన సినీ నిర్మాత కేదార్, కేటీఆర్ బిజినెస్ పార్టనర్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మరణాలపై జ్యూడిషియల్ విచారణను కేటీఆర్ ఎందుకు కోరడం లేదని సీఎం ప్రశ్నించారు. దుబాయిలో కేదార్ మృతి చెందిన హోటల్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నారని కూడా సీఎం ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులు త్వరలో విచారణకు వస్తున్న సమయంలో ఇలాంటి మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. తన వ్యాపార భాగస్వామి మరణంపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మరణాలపై కేటీఆర్ కోరితే తాము విచారణ చేయిస్తామని కూడా సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసారు. కేదార్ మరణంతో లింక్ ఉన్న డ్రగ్స్ కేసు బయటికి తీసి విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే కేదార్ మృతదేహం ఇండియాకు రానుందన్నారు.

తెలుగు నిర్మాత కేదార్ దుబాయిలో మృతి
తెలుగు సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతి చెందినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. తెలుగు సినీ ఫైనాన్షియర్ కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుక దుబాయిలో జరిగింది. దీనికి సినీ ప్రముఖులు అనేక మంది హాజరయ్యారు. వీరిలో నిర్మాత కేదార్ కూడా ఉన్నారు. సోమవారం రాత్రి మిత్రులతో పార్టీకి హాజరైన కేదార్ అనంతరం తన ఫ్లాట్‌లో నిద్రపోయారు. నిద్రలోనే అతను మృతి చెందినట్టు సమాచారం. కేదార్ బస చేసిన హోటల్లో మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ సదరు మాజీ ఎంఎల్‌ఎ తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్టు బుధవారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కాగా ఏడాది క్రితం గచ్చిబౌలి లో రాడిసన్ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేయగా, కొకైన్ తో కేదార్ పట్టుబడ్డారు. హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో ‘గం గం గణేశా’ పేరుతో కేదార్ సినిమా తీసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News