అంత అవసరం ఏమొచ్చిందని
మండిపాటు హీర్యా నాయక్‌కు
మెరుగైన వైద్యం అందించాలని
ఆదేశం ప్రజా ప్రభుత్వంలో
ఇలాంటి చర్యలను సహించమని
హెచ్చరిక విచారణ జరిపి
నివేదిక ఇవ్వాలని
ఉన్నతాధికారులకు హుకుం
హుటాహుటిన సంగారెడ్డి వెళ్లిన
ఐజి సత్యనారాయణ
కుట్రకోణం ఉందా? అనే
కోణంలో ఆరా సంగారెడ్డి
జైలు సూపరింటెండెట్‌పై
అనేక అనుమానాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా లగచర్లలో భూ సేకరణపై ప్రజాభిప్రాయ సే కరణకు వెళ్లిన కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి జిల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్న రైతు హీ ర్యానాయక్‌కు గుండెనొప్పి రా వడంతో బేడీలు వేసి ఆస్పత్రికి తీ సుకెళ్లిన ఉదంతం పై ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి పోలీసులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. రైతుకు బీడీ లు వేసి తరువాయి
తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసు అధికారులపై సీఎం మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో ఇలాంచి చర్యలను సహించేది లేదని సీఎం మండిపడ్డారు. ఈ అంశంపై విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన పోలీసు, జైలు అధికారులపై చర్య తీసుకోవామని కూడా సీఎం ఆదేశించడంతో సైబరాబాద్ ఐజి సత్యనారాయణ హుటాహుటిన సంగారెడ్డికి వెళ్లి విచారణ ప్రారంభించారు.
జైలు సూపరింటెడెంట్ లేఖ వెనుక కుట్ర కోణం
లగచర్ల రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేయడం వెనుకు కుట్ర కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లగచర్ల ఘటనపై కేసు బుక్ చేసిన వికారాబాద్ పోలీసులకు కానీ, జైలు పరిధిలోకి వచ్చే సంగారెడ్డి పోలీసులకు కానీ సమాచారణ ఇవ్వకుండా నేరుగా సైబరాబాద్ కమిషనర్‌కు సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్ నేరుగా లేఖ రాయడం అనుమానాలకు దారితీసింది. ఈ నెల 12 కోర్టు/ఆస్పత్రికి తీసుకవస్తున్న లగచర్ల రైతులు 14 మందికి గట్టి భద్రత (స్ట్రాంగ్ పోలీస్ ఎస్కార్ట్) ఏర్పాటు చేయాలని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు బుధవారం లేఖ రాసారు. ఈ కాపీని రిజర్వు ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎఆర్ హెడ్ క్వార్టర్స్) సైబరాబాద్ కూడా జత విడిగా పంపించారు. ప్రస్తుతం ఈ లేఖ వివాదాస్పదం అయింది. కేసు బుక్ చేసిన పోలీసులకు కానీ, జైలు పరిధిలో ఉన్న సంగారెడ్డి పోలీసులకు కాకుండా సైబరాబాద్ సీపీకి లేఖ రాయడం ఏమిటి? పైగా రైతుకు బేడీలు వేయడం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం కావడంతో ఇదే కోణంలో ఐజి సత్యనారాయణ విచారణ జరుపుతున్నట్టు పోలీసు వర్గాల సమాచారం.