Monday, March 17, 2025

సిఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ తన పాలనలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డిని ఎంతో గౌరవించారని గుర్తు చేశారు.

కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఏకపక్షంగా వ్యవహరించి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని అన్నారు. గతంలో ఎల్‌ఆర్ఎస్ ఉచితమని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News