Thursday, January 23, 2025

ఎన్‌ఆర్‌ఐలకు సిఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

ఎన్‌ఆర్‌ఐ బిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం

మన తెలంగాణ / హైదరాబాద్ :  అసెంబ్లీ సాక్షిగా ఎన్‌ఆర్‌ఐలను అవమానపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్‌ఆర్‌ఐ బిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌డిసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఖండించారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాన్ నెహ్రూ, బిఆర్. అంబేద్కర్ ఇలా మన దేశం గర్వించే గొప్ప వాళ్లంతా ఎన్‌ఆర్‌ఐలేనని గుర్తు చేశారు.

మన దేశానికి, రాష్ట్రానికి ఎన్‌ఆర్‌ఐలు ఎంతో సేవ చేస్తూ మనందరం గర్వపడేలా ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు ఎన్‌ఆర్‌ఐలు గొప్పగా కనిపిస్తారని, వారి అవసరం తీరిపోయాక పదవి రాగానే అహంకారంతో మాట్లాడుతున్నారని, దీన్ని యావత్ ఎన్‌ఆర్‌ఐ లోకమంతా ఖండిస్తుందని అనిల్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎన్‌ఆర్‌ఐలందరికీ క్షమాపణ చెప్పాలని అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News