Monday, December 23, 2024

పడగొడతామంటే.. నిలబెడుతున్నారు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్ : ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెడతామని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో నడిచి వస్తున్నారని సిఎం రేవంత్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూలిపోతుందన్న వాళ్లు ఎక్కడున్నారు, వాళ్లే రోజులు లెక్కపెట్టుకుంటున్నారని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారును కూలుస్తామని, మా పని అయిపోయిందన్న వాళ్లు ఇప్పుడు కంటికి కనిపించకుండా పో యారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు వారి పార్టీలో ఎవరున్నా రు? ఎవరు పోయారు? అని రోజూ లెక్క పెట్టుకునే పనిలో ఉన్నారని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఉద్దేశించి సిఎం రేవంత్ పరోక్షంగా సె టైర్లు వేశారు. అభివృద్ధి కోసం ప్రకాశ్ గౌడ్ లాంటి వాళ్లు తమతో కలి సి వచ్చారన్నారు. పార్టీలో చేరుతున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి తన దగ్గర ఏముందని, అంగీ, లాగు తప్ప నా దగ్గర ఏమీ లేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పదేళ్లు పక్కాగా ఉంటుందని సిఎం రేవం త్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల వారు అచ్చోసిన ఆం బోతుల్లా మాట్లాడుతుంటే తాము ఊరుకోవాలా అ ని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలు చూసి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముందు కు వస్తున్నారని ఆయన చెప్పారు. అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని, మంచిచేసే ప్రభుత్వానికి అండగా ఉండటానికి తమతో వారు చేయి కలుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభు త్వం వచ్చి ఆరు నెలలు గడిస్తే అందులో మూడు నెలలు ఎన్నికల కోడ్‌తోనే గడిచిపోయిందని సిఎం చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో నిర్వహించిన ‘కాటమయ్య రక్ష కిట్ల పంపి ణీ’ కార్యక్రమంలో సిఎం రేవంత్ పాల్గొన్నారు.

శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్, రాచకొండ ప్రాంతంలో అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతా న్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అనుకూలంగా మార్చబోతున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే హయత్‌నగర్‌కు మెట్రో రాబోతుందని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ సం బంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని సిఎం రేవంత్ చెప్పారు. ఎక్కడా లేని విధంగా కేవలం ఒక్క రంగారెడ్డిలోని ఎకరం భూమి రూ.100 కోట్ల పలుకుతుందన్నారు. 360 కిలోమీటర్ల మేర రీజినల్ రిం గ్ రోడ్డు నిర్మిస్తున్నామని సిఎం పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు ఏం తెచ్చారు?
ఫాంహౌస్‌లో ఉన్నవాళ్లు ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు తెచ్చారో చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వారు గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చారని సిఎం రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు అన్ని ప్రణాళికలు చే స్తున్నామని వెల్లడించారు. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు. అందుకే కుల వృత్తులను బలోపేతం చేసుకుంటే బతకవచ్చని సిఎం చెప్పారు. కాంగ్రెస్‌లో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. సిఎం గీత కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్‌గూడలోని తాటివనంలో సిఎం ఈ సందర్భంగా ఈత మొక్క నాటారు. కవ చం పనితీరును సిఎం రేవంత్‌కు బుర్ర వెంకటేశం వివరించారు. గీతకార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తాటివనాల పెంపును ప్రో త్సాహించాలని, ప్రతి గ్రామంలో దీని కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని గౌడన్నలు సిఎంకు విజ్ఞప్తి చేశారు.

గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారుపేరు
ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని గౌడన్నలు ఎంతో ప్రచారం చేశారని సిఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బలహీనవర్గాల గౌరవం పెరుగుతుందని గౌడన్నలు ప్రచారం చేశారన్నారు. పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలు. కులవృత్తులకు చేయూత అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎవరెస్టు ఎక్కిన వారి అనుభవం గౌడన్నల రక్షణకు ఉపయోగపడిందన్నారు. వారిని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన అన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ కు మంత్రి పదవి, ఎమ్మెల్సీగా మహేష్ గౌడ్‌కు, బిసి కార్పొరేషన్ చైర్మన్ పదవి శ్రీకాంత్ గౌడ్‌కు, కాంగ్రెస్ పార్టీ కాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీ గౌడ్‌ను నియమించామని రేవంత్ రెడ్డి అన్నారు.

రోడ్ల పక్కన చెట్లు నాటాలన్న నిబంధన విధిస్తాం
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో తాటివనాలు తగ్గుతున్నాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోడ్ల పక్కన తాటిచెట్లు నాటాలన్న నిబంధన విధిస్తామని చెప్పారు. గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి ప్రతీకలని ఆయన కొనియాడారు. వా నాకాలంలో గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. నీరా షాపులు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎ న్నో కీలక ప్రాజెక్టులు తీసుకురావడంలో దేవేందర్‌గౌడ్ కీలకపాత్ర పోషించారని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచుతామని సిఎం రేవంత్ అన్నారు. ప్రాజెక్టుల దగ్గర, కాలువల పక్కన తా టి, ఈత వనాలు పెంపకం చేపట్టినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ భూ ముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు తమకు ఎలాంటి అ భ్యంతరం లేదన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలన్న కాంగ్రె స్ ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. పేదల కోసం ఫీజు రీయింబర్స్‌మెం ట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చామని సిఎం రేవంత్ ఉద్ఘాటించారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. కెసిఆర్ ప్రభుత్వం రూ.8లక్షల కోట్ల అప్పులు చేసిందని సిఎం రేవంత్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ చేసిన అప్పులకు నెలకు రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని సీ సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలను, మెడికల్ టూరిజం, పరిశ్రమల ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

నిరుద్యోగులతో చర్చలకు సిద్ధం
నియామక పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ అంశంపై సిఎం రేవంత్ స్పందించారు. పరీక్షలను కొంతమం ది వాయిదా వేయాలని కోరితే మరికొందరు ముందుకు పోవాలని అంటున్నారని సిఎం రేవంత్ తెలిపారు. నిరుద్యోగుల బాధలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు. పరీక్షల వాయిదా కోసం రోడ్డెక్కే బదు లు మంత్రులను కలిసి చర్చిస్తే వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తమది అని సిఎం చెప్పుకొచ్చారు.

పొన్నం ఆదేశాలతో టాడీ కార్పొరేషన్ కమిషనర్
పూర్వకాలం నుంచి గీత కార్మికులు ఒకే విధమైన మోకు, ముత్తాదును ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో ‘కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ’ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. మోకు, ముత్తాదును ఉపయోగించిన స మయంలో చాలామంది జారిపడి ప్రాణాలు కోల్పోవడం, కాళ్లు, చేతులు, నడుములు విరిగి మంచానికే పరిమితమయిన వారున్నారు. అలాంటి జరగకుం డా బీబిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం సూచనల మేరకు పలు ఏజెన్సీలు సేఫ్టీ మో కులను రూపొందించాయి. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ త యారు చేసిన సేఫ్టీ మోకును పనితీరును అధికారులు ప్రాక్టికల్‌గా పరిశీలించా రు. గీతకార్మికులకు ఉచితంగా ఈ సేఫ్టీ మోకులను పంపిణీ చేసింది. అనంతరం గీతకార్మికులతో కలిసి సిఎం భోజనాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News