Saturday, November 23, 2024

రైతు రుణం తీర్చుకున్నాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చే స్తానని సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు చీము, నెత్తురు సిగ్గు, శరం ఉంటే వెంటనే తన పదవీకి రాజీనామ చేయాలి. రాజీనామా చేయకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి నేను చేసిన స వాల్‌ను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపుహౌస్2ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడవద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం జి ల్లా వైరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మూడో విడత రైతు రుణమాఫీ పథకం అమలు బహిరంగ సభ లో సిఎం ప్రసంగించారు.

ఎమ్మెల్యే హరీశ్‌రావు, బిఆర్‌ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇ ప్పటివరకు ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకే ధపా రూ. 32వేల కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని, ఇప్పటికే 18 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయన్నారు. కేవలం 25 రోజుల వ్యవధిలో 18 వేల కోట్ల నిధులను బ్యాంకులో వేసిన ప్రభుత్వం దే శంలో ఎక్కడ లేదన్నారు. ‘రుణమాఫీపై హరీశ్ రావు స వాల్ చేసిన రోజే చెప్పా. రాజీనామాకు సిద్ధంగా ఉం డూ.. సిద్దిపేట పీడ విరగడ అవుతుందని, ఇప్పుడు వి జయవంతంగా రుణమాఫీ చేశానని గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా హీనం గా తయారైందని బతుకు బస్టాండ్ అయిందన్నారు. పొద్దున లేస్తే అబద్ధాలతో ఆ పార్టీ నేతలు సిగ్గు లేకుం డా ప్రజలను దోషులుగా నిలబెట్టే ప్ర యత్నం చేస్తున్నార’ని విమర్శించారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ పా ర్టీని భూస్థాపితం చేయడం ఖాయమని, ఆ పార్టీని బం గాళఖాతంలో కలిపే బాధ్యత తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. బిజెపికి జాగా లేదని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తనకు అం డగా ఉంటే బిఆర్‌ఎస్‌ను బొందపెట్టడం పెద్ద సమస్య కాదన్నారు. ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్‌కు ఒక సీటు ఇ వ్వకుండా బొంద పెట్టినా వారు మారడం లేదన్నారు. తెలంగా ణలో బిజెపికి 8 ఎంపి సీట్లు ఇస్తే మోడీ మాత్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారన్నారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా..
ఇదే ఖమ్మం గడ్డపై పార్లమెంట్ ఎన్నికల ముందు తా ను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార స భలో ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపిస్తే రైతులకు సంబంధించిన రెండు లక్ష ల రుణాలను ఆగస్ట్ 15లోగా మాఫీ చేస్తానని భద్రాద్రి సీతారాముడి సాక్షిగా చేసిన వాగ్దానాన్ని నేటితో నిరూపించుకున్నానని ఆయన అన్నారు. మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నైజం అని, అనాడు 2004లో కరీంనగర్ సభలో సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చి 2014లో హామీని నిలబెట్టుకున్నారని ఆయన గుర్తు చే శారు. గాంధీ వారసుడైన రాహుల్ గాంధీ 2022 మే 6న వరంగల్ సభలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 ల క్షల రుణమాఫీ చేసి నిరూపించామన్నారు. ముందు తుక్కుగూడెంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని, కాం గ్రెస్ పార్టీ హామీ శిలాశాసనమేనని మాట తప్పం మడమ తిప్పబోమన్నారు. ఇళ్లులేని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు.

అభివృద్ధిపై చర్చకు బిఆర్‌ఎస్ సిద్ధమేనా?
రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, 8 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చించేందుకు తాము సిద్ద్ధంగా ఉన్నామని రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఎనీటైమ్, ఎనీ సెంటర్ ఎక్కడికైనా వస్తామని, చివరికి అ మరవీరుల స్ధ్థూపం వద్ద అయినా సరే తమ మంత్రులు వచ్చి చర్చిస్తారని ఆయన పేర్కొన్నారు. ‘ఒక సీతారా మ ప్రాజెక్టు మీదనే కాదు విద్యుత్, వ్యవసాయ, సాగునీటి రంగం ఏ అంశంలోనైనా చర్చించేందుకు తాము సిద్ద్ధంగా ఉన్నామని తమ ప్రభుత్వం నుంచి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వస్తారని మీ తరఫున బావ బామ్మర్దులు వస్తరో ఎవ్వరు వ స్తారో రండి తెల్చుకుందాం. తెలంగాణ సమాజాన్నే న్యాయం అడుగుదాం’ అని సవాల్ విసిరారు. భట్టి చే సిన సవాల్‌ను తాను ఏకీభవిస్తున్నానని సవాల్‌ను స్వీకరించి చర్చకు సిద్ధంగా ఉండాలని ఆయన బిఆర్‌ఎస్ నేతలకు సూచించారు. ఫామ్ హౌస్‌లో పండుకోని బయటకు రావడం లేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. బిఆర్‌ఎస్‌ను దగ్గరికి రానిస్తే నాగుపాముకు 2026 ఆగస్ట్ 15లోగా సీతారామ ప్రాజెక్టును పూర్తిచే శామని, రానున్న కాలంలో మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం తీసి తీరుతానని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇ చ్చారు.

ఉద్యోగాల బాధ్యత నాదే
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమీషన్ ను ప్రక్షాళన చేసి 90 రోజుల వ్యవధిలోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు క ల్పించానని, ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించానని రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3, డిఎస్‌సి పోస్టులతో సంవత్సరం లోపే 60 వేల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రు లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రసంగించగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పార్లమెంట్ సభ్యులు రామసహయం రఘురాంరెడ్డి, పొరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు మాలో తు రాందాస్ నాయక్, డా.రాగమయి, ఎం. వెంకటేశ్వర్లు,డాక్టర్ తెల్లం వెంకట్రావ్, కోరం కనకయ్య,జారే అదినారాయణ, డాక్టర్ రాంచందర్ నాయక్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, గిడ్డంగుల సంస్ధ చై ర్మన్ రాయల నాగేశ్వర్ రావు, హస్తకళల చైర్మన్ నా యుడు సత్యం, సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తదితరులున్నారు.

మూడు పంపుహౌస్‌ల ప్రారంభం
సీతారామ ప్రాజెక్టు కు సంబంధించిన మూడు పంపు హౌస్‌లను గురువారం ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలోని ఒక పంపును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వీచ్ అ న్ చేసి ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్‌ను కూడా ఆవిష్కరించి గోదావరి నీళ్లకు పూజలు చేశారు. మండలంలో కమలాపుర్ గ్రామంలోని మరో పంపు హౌస్‌ను డిప్యూటీ సి ఎం మల్లు భట్టి విక్రమార్క, మండలం బి జి కొత్తూర్‌లోని మరో పంపు హౌస్‌ను ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించి గోదావరి నీటికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎంపి, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పివో తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News