Sunday, March 16, 2025

15 నెలల్లో రెండు సార్లే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చారు:సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల కాలంలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు సార్లే శాసనసభకు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే ఆయనకు జీత భత్యాల కింద ప్రభుత్వం నుంచి 15 నెలలకు రూ.57.87 లక్షలు చెల్లించిందని గుర్తు చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై సిఎం ప్రసంగిస్తూ గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో 15 నెలల వ్యవధిలో కేవలం రెండు సార్లే అసెంబ్లీకి కెసిఆర్ వచ్చారని, ప్రభుత్వం నుంచి వేతనం అంతుకుంటున్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం కెసిఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. సభకు వచ్చి విలువైన సూచనలు చేసి ప్రభుత్వానికి సహకరించకుండా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని రేవంత్‌రెడ్డి అన్నారు. కేవంలం తాను జీత భత్యాల గురించి మాత్రమే చెప్పానని, ఇంకా కెసిఆర్‌కు సంబంధించిన సెక్యూరిటీ, ఇతరత్రా అంశాల లెక్కల జోలికి వెళ్లడం లేదని అన్నారు. కెసిఆర్‌కు ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యుల నుంచే ముప్పు ఉందని, సెక్యూరిటీ లెక్కలు కలిపితే ఇంకా ఎక్కువే అవుతాయని అన్నారు. ఆయనకు ఇంటి పోరే ఎక్కువగా ఉందని, అందుకు నిత్యం ప్రభుత్వ భద్రత మధ్య కొనసాగుతున్నారని తెలిపారు.

బిఆర్‌ఎస్‌ను మార్చురీకి పంపారని అన్నానే తప్ప కెసిఆర్‌ను కాదు
తాను అనని మాటలు అన్నట్టు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు మార్చురీకి పంపారని అన్నానని, అయితే కెసిఆర్‌ను మార్చురీకి పంపాలని అన్నట్లు బిఆర్‌ఎస్ నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కేసీఆర్‌ను వందేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని కోరుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని, ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడితే స్టేచర్ స్టేచర్ అంటున్నారని చెబుతూ రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. నాకు మీ స్టేచర్ కన్నా తెలంగాణ ఫ్యూచర్ ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండినా, ఎవరైనా చచ్చిపోయినా తండ్రి, కొడుకు, మామా అల్లుండ్లు కలిసి డ్యాన్సులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ నేతల కళ్లలో పైశాచిక ఆనందం కనిపిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలే తప్పు చేశారన్నట్టు బిఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేయడాన్ని రేవంత్‌రెడ్డి ప్రస్తావిస్తూ ప్రజలు కూడా 2022 నుంచి తమ నిరసన వివిధ రూపాల్లో తెలుపుతూనే ఉన్నారని, వీళ్ల ఆగడాలు తగ్గలేదని గుర్తించే తమకు అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News