Friday, December 20, 2024

కిషన్‌రెడ్డి గుజరాత్ గులాం

- Advertisement -
- Advertisement -

గుజరాత్ మోడల్ దండగ…
దేశంలో తెరపైకి తెలంగాణ
మోడల్ సబర్మతి రివర్ ఫ్రంట్‌కు
చప్పట్లు కొట్టి మూసీ ప్రక్షాళనను
మాత్రం వ్యతిరేకిస్తారా? ధారావి
ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని
మహారాష్ట్రను లూటీ చేసేందుకు
కుట్ర మహాయుతి కూటమికి
గుణపాఠం చెప్పేందుకు రైతులు,
పేదలు సిద్ధం మహారాష్ట్ర ఎన్నికల
ప్రచారంలో సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: గుజరాతీ కా గు లామ్‌గా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మారారని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర మంత్రి కి షన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, విమర్శలను సీఎం తిప్పి కొట్టారు. తమ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందడాన్ని చూసి కిషన్‌రెడ్డి ఓర్వలేకపోతున్నార ని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆదివారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్ థాకరే)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)- కాంగ్రెస్ తరఫున ప్రచారంలో భాగంగా మహా వికాస్ అగాఢీ అభ్యర్థుల కోసం తెలుగు వా ళ్లు ఎక్కువగా స్థిరపడిన నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జ నతా పార్టీ తెలంగాణ నాయకులు చేపట్టిన మూ సీ నిద్ర గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు ప ట్టా రు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోంటే నిందలు వేస్తున్నారని ఆరోపించారు.

గుజరాత్‌లో సబర్మతి రి వర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తే కిషన్ రెడ్డి చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారని, ఆ ప్రాజెక్ట్ కోసం ప్రభు త్వం 50వేల మందిని తరలించిందని గుర్తుచేశా రు. అలాంటి ప్రాజెక్టే తాము చేపడితే విమర్శలు గుప్పిస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నా రు. దీనిని బట్టి చూస్తే కిషన్ రెడ్డి గుజరాత్‌కు గులాంలా మారినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చే శారు. గుజరాత్ మోడల్‌కు ధీటుగా తెలంగాణ మోడల్ అభివృద్ధి చెందుతోందని, ఇది దేశానికే రోల్ మోడల్ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తన సారథ్యంలోని కాంగ్రెస్ ప్ర భు త్వం అనుసరిస్తోన్న విధానాలు దేశం మొత్తానికీ ఆదర్శవంతమవుతాయని, గుజరాత్ మోడల్ ఘో రంగా విఫలమవుతుందని చెప్పారు. ముఖ్యమం త్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ ప వార్ సొంత కుంపటి పెట్టుకుని మహారాష్ట్ర ప్రజల ను ఏరకంగా అయితే మోసగించారో, అదే తరహా లో కిషన్ రెడ్డి కూడా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ  ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

కిషన్ రెడ్డి సహా తెలంగాణ బీజేపీ నాయకులు ఏమనుకున్నా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ముందుకు తీ సుకు వెళ్తామని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను నిర్దేశించుకున్న గడువులోగా పూ ర్తి చేస్తామన్నారు. తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుపుతామని స్పష్టం చేశారు. మహారాష్ట్రను దోచుకునేందుకు ఇద్దరు గుజరాతీలు వ చ్చారని, ధారావి ప్రాజెక్ట్ ను అడ్డు పెట్టుకుని పెద్ద మొత్తంలో లూఠీ చేసేందుకు స్కెచ్ వేశారని ము ఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మూసీ నదిని బాగుచేయడం బీజేపీ నేతలకు ఇ ష్టం లేదా అని ప్రశ్నించారు. సబర్మతి నది ప్రక్షాళన చేసినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించ లేదని అన్నారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమని బీజేపీ నేతలు చెబుతున్నారని, మూసీ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం రాష్ట్రంలో కమలనాథులు అడ్డుపడుతున్నారని ఎ ద్దేవా చేశారు.

మూసీ ప్రాజెక్ట్ వద్దంటున్నారంటే గుజరాత్ మోడల్ ఫెయిల్ అయినట్లేనా అని సీ ఎం ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ ఏక్‌నాథ్ షిండేను పావుగా వాడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా కిషన్‌రెడ్డి ని అదే తరహాలో ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర కు రావాల్సిన 17 కంపెనీలను ప్రధాని మోడీ మోసపూరితంగా గుజరాత్ కు తరలించారని మండిపడ్డారు. ఇక వారికి అవకాశం ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్ర జలు కూడా సిద్ధంగా లేరని సీఎం రేవంత్‌రెడ్డి అ న్నారు. మహాయుతి కూటమి కి గుణపాఠం చె ప్పేందుకు రైతులు, పేదలు సిద్ధంగా ఉన్నారని తె లిపారు. 11 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రధాని మో డీ ఏం చేశారని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చారో లెక్కలు చెప్పాలన్ని డిమాండ్ చేశారు. రైతుల ఆ దాయం రెట్టింపు చేస్తామని, ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించా రు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి చోటు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

గ్రూప్-3 అభ్యర్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఎక్స్ వేదికగా గ్రూప్-3 అభ్యర్థులకు విషెస్ చెప్పారు. గ్రూప్ -3 పరీక్షకు హాజరవుతున్న ఉద్యోగార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరీక్షలో మీరు విజయం సాధించి కొలువుల కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News