Saturday, January 11, 2025

ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మేడ్చల్‌జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచి పెడుతుందంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవన్నా రు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిందని, ఏ నాడూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోలేద ని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ, కెసిఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, తన బిడ్డ బెయిల్ కోసం మాజీ సిఎం ఐదు స్థానాల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థుల తలలు మోడీకి తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి మద్దతుగా మేడ్చల్ మల్కాజిగిరి జి ల్లా, శామీర్‌పేట మండలం, అంతాయిపల్లిలో సోమవారం ని ర్వహించిన జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెం ట్ల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున సభలో పా ల్గొన్నారు. అంతకు ముందు ఆయన ఆదిలాబాద్, నిజామా బాద్‌లలో జరిగిన జనజాతర సభల్లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… బిజెపి, బిఆర్‌ఎస్ కుట్రపూరిత రాజకీయాలను తిప్పికొట్టాలని
అన్నారు. మోడీ, కెసిఆర్ తోడు దొంగలని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్‌కు మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని తొక్కి బొందపెట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతారని మాట్లాడటం ప్రధానికి గౌరవమా అని అన్నారు. బిజెపి మతాలు, భాషల మధ్య చిచ్చుపెట్టి నీచ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. రాముడి పేరుతో ఎంతకాలం రాజకీయాలు చేస్తారని విమర్శించారు. దేవుడు గుడిలో భక్తి గుండెల్లో ఉన్నావాడే నిజమైన హిందువని, తాను నిజమైన హిందువునని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాను కమ్యునిస్టునని చెప్పుకునే ఈటల రాజేందర్ మతతత్వ బిజెపి నుండి ఎలా పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. కెసిఆర్ అవినీతి, ధరిణితో కొల్లగొట్టిన భూములపై విచారణ కోసం ఈటల రాజేందర్ నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి ఎందుకు ఆదేశాలు తీసుకురాలేదని నిలదీశారు.

కెసిఆర్‌ను విమర్శించే ఈటల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెటిఆర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న నరేంద్ర మోడీ నల్ల చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. స్విస్ బ్యాంకులో దాచిన రూ.లక్షల కోట్ల నల్ల ధనాన్ని తెచ్చి జన్‌ధన్ ఖతాల్లో వేస్తానని విస్మరించారని, ఏడాదికి కోటి ఉద్యోగాలు ఏమయ్యాయని అన్నారు. మోడీకి ఓట్లు ఎందుకు వేయాలని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధమా అని ఈటల రాజేందర్‌కు సిఎం సవాల్ విసిరారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చేసిన సర్వేలో ఆకలి సూచిలో భారతదేశం 111 స్థానంలో ఉన్నందుకు మోడీ సిగ్గుపడాలని అన్నారు. మతం, దేవుడు పేరుతో రాజకీలు చేసే బిజెపిని పొలిమేరల వరకు తరిమికొట్టాలని రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

మల్కాజిగిరి అభివృద్ధికి పూచీ నాది…
మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధికి పూచీ తనదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి కంటోన్మెంట్, ఎల్‌బి నగర్ ప్రాంతాలలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. 2018 ఎన్నికల్లో కొడంగల్‌లో కెసిఆర్ కుట్రతో ఓడిస్తే ..ప్రభుత్వ కుట్రను గుర్తించి 2019 ఎన్నికల్లో తనను ఆదరించి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపిగా గెలిపించారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలిచ్చిన ధైర్యంతో ఇంతవరకు వెనుదిరిగి చూడలేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపిగా ఈప్రాంత అభివృద్ధికి ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఆనాటి ప్రభుత్వ పెద్దలు సహకరించలేదన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తనపై ఉందని, ఇక్కడి భూములు వంద కోట్లు పలికేలా పరిశ్రమలు, ఐటి, ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తానని అన్నారు. ఎన్నికలు ముగియగానే అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీలతో ఈ ప్రాంతలో ఎంతోమంది పేదలు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. తాము ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాల రద్దుకు కుట్ర జరుగుతోందని, అయితే అడ్డు వచ్చిన వారిని తొక్కుతూ వెళ్లి ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సునీతమ్మకు వేసిన ఓటు తనకు వేసినట్లేనని అన్నారు.

నిర్ణీత సమయంలో ప్రతి హామీని నెరవేరుస్తాం ః శ్రీధర్‌బాబు
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిర్ణీత సమయంలో తప్పనిసరి నెరవేరుస్తామని ఐటి శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మల్కాజిగిరిలో పట్నం సునితా మహేందర్‌రెడ్డి విజయంతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగి అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని, సిఎం రేవంత్‌రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, ఎంఎల్‌సి పట్నం మహేందర్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మైనంపల్లి హనుమంత్‌రావు, మాజీ ఎంఎల్‌ఎ మలిపెద్ది సుధీర్‌రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, డిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నాయకులు కూన శ్రీశైలం గౌడ్, రమేష్, పరమేశ్వర్‌రెడ్డి, గణేష్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News