మన తెలంగాణ / షాద్‌నగర్/ నారాయణపేట ప్రతినిధి : ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ బిజెపి అని, ఆ పార్టీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తోందని, దేవుడి పేరు చెప్పుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. షాద్‌నగర్ ఎంఎల్‌ఎ వీర్లపల్లి శంకర్, పార్టీ ఎంపి అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ పట్టణ ముఖ్యకూడలిలో నిర్వహించిన ర్యాలీ, రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గతంలో డికె అరుణను జడ్‌పిటిసి, ఎంఎల్‌ఎ, మంత్రిని చేసిందని, నేడు తనకు అన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీని వీడి శత్రువు పార్టీలో చేరి వెన్నుపోటు పొడడడానికి సిద్ధమయ్యారని అన్నారు.
అరుణది మాఫియా కుటుంబమని, ఆమెకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోడీ రావడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న పదేళ్లలో రాష్ట్రంలో ప్రాజెక్టుల గురించి ఆమె ఎందుకు మాట్లాడలేదని, పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా కల్పించలేకపోయాన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పడావు పెట్టిన ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తనపై ప్రధాని నిజమని షాద్‌నగర్ చౌరస్తా వద్ద ముక్కు నేలకు రాస్తానని, డికె అరుణ కుటుంబంపై వచ్చే ఆరోపణలు నిజమైతే ప్రధాని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కెసిఆర్ తెలంగాణకు ద్రోహం చేసిండన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని అన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ చీకటి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.
గత సిఎంలు పాలమూరు జిల్లాలకు ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో వలసలతో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో 2004 నుంచి 2009 వరకు అప్పటి కాంగ్రెస్ సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన అభివృద్ధితోనే నేడు తెలంగాణ రాష్ట్రంలో భూమి ధరలు పెరిగాయన్నారు. షాద్‌నగర్ శ్రీమంతులదని అన్నారు. అంతర్జాతీయ విమానశ్రయానికి కూతవేటు దూరం ఉన్న షాద్‌నగర్ అన్ని రంగాలలో అభివృద్ధి శరవేగంగా సాధిస్తోందని అన్నారు. షాద్‌నగర్ అంబేద్కర్, జెపి దర్గా సాక్షిగా ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. షాద్‌నగర్ వరకు మెట్రో తీసుకువస్తామని అన్నారు. ముదిరాజ్‌లను బిసి- డి నుంచి బిసి ఎకి, ఎస్‌సి వర్గీకరణ జరగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలన్నారు. బిఆర్‌ఎస్, బిజెకికి ఓటుతో బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు ప్రజలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద మాజీ ఎంఎల్‌ఎ బి. కిష్టయ్య, మాజీ ఎంపిపి వన్నాడ ప్రకాష్‌గౌడ్‌తో పాటు పలువురు నాయకులు సిఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసిలు వెంకట్రాంరెడ్డి, విశాల శ్రావణ్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి శ్యామ్‌సుందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బిజెపికి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్లే
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా, మక్తల్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల జన జాతర ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశం చేజారిపోతే… ఈ జిల్లా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావన్నారు. బిజెపి ఎంపి అభ్యర్థి అరుణ ఓడిపోతే పాలమూరు జిల్లాకు వచ్చే నష్టమేమీ ఉండదని అన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పదేళ్లుగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉందని, తెలంగాణలో ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపిలు, ఒక కేంద్ర మంత్రి ఉండి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. బిజెపిని గెలిపిస్తే మత విద్వేషాలను ప్రోత్సహించినట్లేనని అన్నారు. తెలంగాణకు రావాల్సిన కంపెనీలు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌కు తరలించుకపోవడం ఏనాడైనా చూశామా అని అన్నారు. నిత్యం మత కలహాలు ఉండడం వల్లే యుపికి కంపెనీలు రావడం లేదన్నారు.
అందుకే తెలంగాణకు వచ్చిన సంస్థలను తరలించుకుపోతున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభావం ఏమాత్రం లేని గురుగ్రామ్‌కు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని అన్నారు. తెలంగాణలో బిజెపి కి ఓటు వేస్తే ఇక్కడికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో అయినా మత కలహాలు ఉంటే పరిశ్రమలు రావని, ఉపాధి అవకాశాలు పెరగవని అన్నారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బజెపి అగ్రనేతలు 400 సీట్లకు టార్గెట్‌గా పెట్టుకున్నారని అన్నారు. పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా మక్తల్‌లో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలన్న వంశీచందర్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ ఆ పార్టీకి మోసగించి బిజెపికి ఓటు వేయాలని లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నారని, బిజెపి, బిఆర్‌ఎస్ రెండు పార్టీలు ఒకటేనన్నారు. ఎస్‌సి వర్గీకరణ, ముదిరాజ్‌లను బిసి ఎలో చేర్చాలన్నా.. వాల్మీకులు ఎస్‌టి జాబితాలో చేరాలన్నా, ముస్లింలకు రిజర్వేషన్ ఉండాలన్నా కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలన్నారు.
ఢిల్లీ సుల్తాన్లకు బానిసైన అరుణమ్మను ఓడించాలని పిలుపునిచ్చారు. బిజెపి ఎంపి అభ్యర్థి అరుణమ్మ ఆ పార్టీకి జాతీయ నాయకురాలుగా ఉన్నా ఏనాడైనా ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బంగ్లా రాజకీయాలు, చీకటి ఒప్పందాలు ఛేదించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఆత్మగౌరవం కోసం జరుగుతున్నాయని, పాలమూరు పరువు నిలబెట్టాలంటే ఆ శక్తి మీ చేతిలోనే ఉందని కార్యకర్తలకు సూచించారు. బూత్ స్థాయిలో కష్టపడి పనిచేసి అధిక మెజార్టీ ఇచ్చిన కార్యకర్తలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపి అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి, పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు వాకిటి శ్రీహరి, పర్ణికా రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ సరిత, వనజమ్మ, మాజీ