Wednesday, January 29, 2025

రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర:సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నారని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నాల్లోనే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని సిఎం అన్నారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజనీ మహమ్మద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు, రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ, ఆయన ప్రయత్నం ఫలించడం లేదన్నారు.

ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మాగాంధీ దేశాన్ని రక్షించినట్లు భారతీయ జనతాపార్టీ పేరుతో చలామణి అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలిసి నడవాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని ఇది ఇది ఒక యుద్ధం ఆయన అన్నారు. ఈ యుద్ధం గాంధీ పరివార్‌కు గాడ్సే పరివార్ మధ్య జరుగుతుందన్నారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోడీ, గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అందుకే మనమంతా గాంధీ పరివార్‌గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలబడాలన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తేస్తాం: రాహుల్ గాంధీ
తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇండోర్ ర్యాలీలో ప్రసంగించిన ఆయన దేశంలో స్వాతంత్య్రం పూర్వం నాటి పరిస్థితులను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి భానిసలుగా మార్చాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ (జీఎస్టీ) పేదలను తొలగించే ఆయుధాలని ఈ దేశంలో బిజెపి పార్టీ అదానీ, అంబానీలకు దోచిపెడుతుందని ఆయన ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News