తెలంగాణలో కమలం పార్టీని అడుగుపెట్టనివ్వను బ్రిటిషర్ల కంటే
బిజెపి నాయకులు ప్రమాదకరం బిజెపిని ఓడించే బాధ్యత ప్రతి
కాంగ్రెస్ కార్యకర్తది మణిపూర్‌లో అశాంతి, ఢిల్లీలో రైతుల
ఆందోళనపై మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? అహ్మదాబాద్
ఎఐసిసి సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ లో బిజెపిని ఖతం చేయడమే తమ లక్ష్యమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి తాను ఒక్కటే చెబుతున్నానని సోనియాగాంధీ నాయకత్వంలో మేం బిజెపి ని అడుగుపెట్టనివ్వమని, బిజెపిని అడ్డుకుంటామని, వారిని ఎవరూ క్షమించరని ఆయన పేర్కొన్నారు. బ్రిటీషర్ల కంటే బిజెపి నాయకులు ప్రమాదకారులని సిఎం రేవంత్‌రెడ్డి అ న్నారు. రానున్న రోజుల్లో బిజెపిని ఓడించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, గాంధీ వారసులు ఇక్కడి నుంచే తీసుకోవాలని ఆయన వి జ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఎఐసిసి సమావేశాల్లో సిఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ మోడీ గ్యారంటీలతో దేశ ప్రజలను బిజెపి మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.
మణిపూర్‌లో అశాంతి, ఢిల్లీలో రైతుల ఆందోళనపై మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాం ధీ మాట ఇస్తే అమలు చేసి తీరుతామని, రా హుల్ గాంధీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ
అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోడీ మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ గాడ్సే సిద్దాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ యువత ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. యువత గాంధీ బాటలో నడుస్తూ మోడీని ఓడించాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీ వారసులకు, గాడ్సే వారసుల మధ్య రాజకీయ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
గాంధీ పరివార్‌కు, గాడ్సే పరివార్‌కు మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో గెలుపు గాంధేయవాదులదేనని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే ప్రధాని మోడీకి భయమని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతారని లోక్‌సభలో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులాలు, మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడుతు న్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. దేశాన్ని విభజించాలని మోడీ చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశమంతా కులగణన చేపట్టాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన చేసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ మోడీకి, అమిత్ షాకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందని, నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ అని, దేశాన్ని విభజించడమే మోడీ లక్ష్యమని ఆయన అన్నారు. అందుకే తెలంగాణలో బిజెపిని, మోడీని అడుగు పెట్టనివ్వమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాహుల్‌గాంధీ బాటలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది
దేశంలో మోడీ పాలన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ పాలనలో పూర్తిగా విఫలమ య్యారన్నారు. అందుకు మణిపూర్ సంక్షోభమే నిదర్శనమని ఆయన తెలిపారు. మోడీకి అధికారం కట్టబెడితే రైతులను మోసం చేశారని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను వంచించారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర నిర్వహించా రని ఆ యాత్రలో మహిళలు, యువత, రైతులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నా మన్నారు. రాహుల్ గాంధీ బాటలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అందులో భాగంగా రైతులకు కిచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. ఏకకాలంలో రైతులకు 2లక్షల రుణమాఫీ చేశామని సిఎం తెలిపారు.
ఇక్కడి సమావేశాల స్ఫూర్తితో తిరిగి తెలంగాణకు వెళ్లి…..
గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన గడ్డపై సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయని, ఇక్కడి సమావేశాల స్ఫూర్తితో తిరిగి తెలంగాణకు వెళ్లి బిజెపిని ఖతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని ఈ ప్రజలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి తీరుతామన్నారు. బిజెపిపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, రానున్న రోజుల్లో మోడీ ప్రజలను మాయం చేయలేరన్నారు. ప్రజా సమస్యలపై రాహుల్‌గాంధీకి పూర్తి అవగాహన ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా
మహ్మాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్‌పటేల్ గడ్డలపైన సబర్మతీ నది ఒడ్డున రెండురోజులుగా మనం మేధోమదన (చింతన్‌బైఠక్) సదస్సు జరుపుకుంటున్నామని సిఎం రేవంత్ తెలిపారు. అధికారం చేపట్టిన తరువాత దేశంలో మోడీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతీ ఒడ్డున మనం ఇక్కడ సమావేశమయ్యామని ఆయన పేరొన్నారు.