- Advertisement -
తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిత్యం అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ముంబై వెళ్లారు. అక్కడ పీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చిన హామీ ప్రకారం 22 లక్షల మంది రైతులకు రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశాం. మోదీ మాత్రం రైతులను అదానీ, అంబానీ చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాల కారణంగా మహారాష్ట్రలోనే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారు’ అని విమర్శించారు.
- Advertisement -