డిసెంబర్ 9న కొన్ని కీలక హామీలను మంత్రివర్గంలో ఆమోదించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ తెలిపారు. గొప్ప ఆశయాలు, ఆకాంక్షలతో ఈ రాష్ట్రం సాధించుకున్నామని వెల్లడించారు. స్వరాష్ట్రంలో తమకు రక్షణ ఉంటుందని, కలలు నెరవేరుతాయని ప్రజలు భావించారన్నారు. ప్రజల ఆకాంక్షలు గత తొమ్మిదిన్నరేళ్లలో నెరవేరలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిరంకుశ ప్రభుత్వం వద్దని ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి కూడా ప్రతిపక్ష నేత రాకపోవడం విచారకరమన్నారు. విపక్ష నేతలు ఇప్పటికైనా సరైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఉండటం సభను అగౌరపరచటమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Watch Live: Hon'ble CM Sri @Revanth_Anumula speaking on Motion of Thanks to Governor's Address in Legislative Assembly. https://t.co/i4TqTTUopD
— Telangana CMO (@TelanganaCMO) February 9, 2024