Monday, January 20, 2025

కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్ లో ధర్నా చేసుకోవచ్చు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్ ఎత్తివేసి తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేసిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాము మళ్లీ ధర్నాచౌక్ ను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి తెలిపారు. కావాలనుకుంటే ఇప్పుడు కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని తెలిపారు. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్న సిఎం గత పదేళ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్ సిఆర్ నివేదిక చెప్పిందన్నారు.

రైతుబీమా కింద 1.21 లక్షల మంది రైతులకు పరిహారం ఇచ్చారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే.. ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావు అని ఆరోపించారు. రైతు పంటలకు .. రైతు జీవితానికి బీమా, హామీ ఉండాలని సిఎం ఆకాంక్షించారు. రైతు బతికి ఉన్నప్పుడు పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం చనిపోయాక రూ. 5 లక్షలు ఇచ్చిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News