Wednesday, December 4, 2024

అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం

- Advertisement -
- Advertisement -

మాది ప్రజా ప్రభుత్వం..ప్రతిపక్షాల సలహాలు
స్వీకరిస్తాం అభివృద్ధిని అడ్డుకునేవారిని ఎలా
ఆపాలో మాకు తెలుసు ప్రపంచంతో హైదరాబాద్
పోటీ పడుతుంది న్యూయార్క్, టోక్యో నగరాలతో
సమానంగా అభివృద్ధి చేస్తాం ఇబ్రహీంపట్నం వద్ద
ఆర్గానిక్ పంటల నిల్వ కోసం అంతర్జాతీయ
మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు ముచ్చర్లలో 40
నుంచి 50వేల ఎకరాల్లో ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి
కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు సాధించాలి
లక్షన్నర కోట్లు తెస్తే పరేడ్ గ్రౌండ్‌లో సన్మానం చేస్తా
ప్రజాపాలన విజయోత్సవాల్లో సిఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో ఒకేరోజు రూ.5,825కోట్ల పనులకు
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతోందని, న్యూయార్క్, టోక్యో నగరాలతో సమానంగా హైదరాబాద్‌ను నడిపిస్తామని సిఎం రేవంత్ అన్నా రు. హైదరాబాద్‌లో అద్భుతమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్త సాంకేతిక అభివృద్ధిలో హైదరాబాదీల పాత్ర ఉందన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉందని, ప్రపంచంలోని అన్ని దేశాల్లోని అగ్ర ఐటీ కం పెనీల్లో ఈ నగర వాసులు ముఖ్య పాత్ర వహిస్తుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో మంగళవారం సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న హెచ్‌ఎండిఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వేదిక మీదుగా నగరంలోని పలు సుందరీకరణ పనులకు వర్చువల్‌గా ఆయన శం కుస్థాపన చేశారు. రూ.5827 కోట్ల పురపాలక శాఖ ని ధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సిఎం ప్రా రంభించారు. నాలుగు కోట్ల ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు డిసెంబర్ 3.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరం గ సభలో ఆయన మాట్లాడుతూ 2023 డిసెంబర్ 3కు ఒక ప్రత్యేకత ఉందని, నాలుగు కోట్ల ప్రజలు తీర్పు ఇచ్చిన రోజని ఆయన గుర్తు చేశారు. ప్రజల తీర్పుకు ఏ డాది పాలన పూర్తయిందని ఈ పాలన విజయాలను పండగలాగ జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే శంషాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును నిర్మించి, ఇంటర్నేషనల్ విమానాలు నగరానికి వచ్చేలా చేశారన్నారు. మె ట్రో ప్రాజెక్టు వలన ఈ నగరం దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చింది కాంగ్రెస్ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. దేశానికి కంప్యూటర్‌ను రాజీవ్ గాంధీ పరిచయం చేశారన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఫార్మా కంపెనీలు కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. నగరంలో పేదల కోసం పిజేఆర్ పోరాడారఅన్నారు. హైదరాబాద్‌లో త్రా గునీటి సమస్యను తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సి ఎం రేవంత్ అన్నారు. తమ ముందు తరం కాంగ్రెస్ నా యకులు చేసిన అభివృధ్ధికి మరింత అభివృద్ధిని ఇప్పు డు తాము జోడిస్తున్నామన్నారు. 360 కి.మీల రీజనల్ రింగ్‌రోడ్డును రూ. 35 వేల కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు వేసి, గ్రామాల్లో భూముల విలువ పెంచుతున్నామని ఆయన తెలిపారు.

కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నాం
ఇబ్రహీంపట్నం వద్ద ఆర్గానిక్ పంటల నిలువ కోసం అంతర్జాతీయ మార్కెట్‌ను, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ము చ్చెర్లలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో టోక్యో, సింగపూర్, న్యూయార్క్ లాంటి అంతర్జాతీయ నగరాన్ని ని ర్మిస్తామని ఆయన వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌ను కొబ్బ రి నీళ్ల మాదిరిగా స్వచ్ఛమైన నీరు చేస్తామని, వరంగల్ ను లండన్, కరీంనగర్‌ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ సిటీ చేస్తామని గత పాలకులు గొప్పగా ప్రకటించారు కానీ, అక్కడ విపరీతమైన ట్రాఫిక్, వర్షాల వలన వరదల్లో ఆ నగరాలు మునిగిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ కాలుష్యం, ముంబయి, చెన్నై మా దిరిగా వరదలు, బెంగుళూర్ లాంటి ట్రాఫిక్, కలకత్తా వంటి మురికి మనకు వద్దన్నారు. అలాంటి అధ్వానస్థితికి మన హైదరాబాద్‌ను చేరకుండా రక్షించేందుకు రూ.7 వేల కోట్లతో పనులు చేపట్టామన్నారు.

హైడ్రాతో భూములను కబ్జా చేయాలనుకుంటే వెన్నులో వణుకు
హైదరాబాద్‌లోని చెరువులను, కుంటలను రక్షించేందు కు హైడ్రా కమిషన్‌ను ఏర్పాటు చేశామని ఆయన అ న్నారు. ఇప్పుడు ఆ భూములను కబ్జా చేయాలనుకునే వారికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నామని ఆయన తెలిపారు. చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణదారుల కు హైడ్రాతో భయం పట్టుకుందని సిఎం అన్నారు. కి షన్ రెడ్డి మూసీ నిద్ర చేసి నాటకాలు ఆడటం కాదని, మూసీని మంచినీటి నదిగా మార్చడానికి, మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు, రీజనల్ రింగ్ రోడ్డుకు మోడీ నుం చి నిధులు తీసుకురావాలని సిఎం రేవంత్‌రెడ్డి సవాల్ వి సిరారు. ఎన్ని నిధులు తీసుకు వస్తావో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కిషన్‌రెడ్డి మూసీలో నిద్రపోతా రో, మోడీని తీసుకువస్తారో మీ ఇష్టమని తెలంగాణకు మాత్రం కిషన్‌రెడ్డి నిధులు సాధించాలన్నారు. మూసీ ప్రక్షాళనకు, మీ నియోజక వర్గానికి మీ వద్ద ఏం ప్రణాళికలు ఉన్నాయని కిషన్‌రెడ్డిని సిఎం ప్రశ్నించారు. నగర అభివృద్ధికి మోడీ నుంచి లక్షన్నర కోట్లు తెస్తే పరే డ్ గ్రౌండ్‌లో సన్మానం చేస్తానని బిఆర్‌ఎస్, బిజెపిలకు తాను ఈ వేదికగా పిలుపునిస్తున్నానని సిఎం రేవంత్ తె లిపారు. మీ పాలసీ డాక్యుమెంట్ తీసుకురండి, తండ్రీ, కొడుకులు పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపండి, సహేతుకమైతే నూటికి నూరు శాతం మీ ప్రతిపాదనతో ముందుకెళతామని ఆయన తెలిపారు. ఇరు పార్టీల నాయకులు గూడుపుఠానితో అభివృద్ధిని అ డ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

మూసీ ప్రక్షాళనకు బిఆర్‌ఎస్, బిజెపి అడ్డు
బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. అక్కడి ప్రజలు ఆ మురికిలోనే బ్రతకాలని వారు కోరుకుంటున్నారన్నా రు. రూ.లక్షన్నర కోట్లతో హైదరా బాద్‌ను ప్రపంచస్థా యి నగరంగా మార్చడానికి తాము ప్రణాళికలు రూ పొందిస్తున్నామని ఆయన ప్రకటించారు. వాన పడితే రోడ్లన్నీ వరదమయం అవుతున్నాయన్నారు. నగరంలో ని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్‌లను ఏర్పాటు చే స్తున్నామని ఆయన తెలిపారు. గతంలో హైదరాబాద్ మునిగితే మోడీ ఒక్క పేసా కూడా ఇవ్వలేదని సిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వర్షానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సిఎం వివరించారు. తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. ఏడ్చే వాళ్ల గురించి తమకు బాధ లేదన్నారు.

రియల్ ఎస్టేట్ పడిపోలేదు
ఎంతమంది విష ప్రచారం చేసినా రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30 వరకు మీరు గమనించాలన్నారు. తాము అధికారంలోకి వచ్చి న తరువాత ఏప్రిల్ 1, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు తమ పాలనలో తేడా చూడాలన్నారు. తమ పాలనలో 29 శాతం ఎక్కువ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగిందని తగ్గలేదని ఆయన తెలిపారు. ఇది తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో అఖిలప క్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎం తెలిపారు. బిఆర్‌ఎస్, బిజెపి వాళ్ల డాక్యుమెంట్ ఇవ్వాలని ఆయన సూ చించారు. మేధావులు కూడా మీ సూచనలు ఇవ్వాలని, ఏడాది పూర్తయిన సందర్బంగా మన భవిష్యత్ ప్రణాళిక మనమే సిద్ధం చేసుకుందామని ఆయన అన్నారు. గోదావరి జలాలు మూసీలో పారాలని, అప్పుడే నగరంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ఏదీ చేసినా అడ్డుకుంటామంటే కుదరదని, తప్పులు, అప్పు లు తప్ప గత ప్రభుత్వం చేసింది ఏమీలేదన్నారు.

తమపై కోపంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్ర జలను శిక్షించొద్దని, నగర అభివృద్ధిని అడ్డుకోవద్దని, నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్ రైజింగ్ వేడుకలను ప్రారంభించిన సిఎం మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను పరిశీలించారు. అదే విధంగా హైదరాబాద్‌లోని రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అయిన జూపార్క్ , ఆరాంఘర్ వరకు గ ల 24కిమీల వంతెనను కూడా సిఎం వర్చ్యువల్ గా ప్రా రంభించారు. ఈ ఫ్లై ఓవర్ జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 24 మీటర్ల వెడల్పుతో 4.08 కిలోమీటర్ల పొడ వు, ఆరు లేన్లతో నిర్మించారు. రూ. 636 కోట్లతో దీనిని నిర్మించారు. దీనివల్ల జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీ దుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మహబూబ్‌నగర్, ఎపిలోని కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కులు తీరినట్టే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో హెచ్‌సిఐటిఐ ఫేజ్-1లో రూ.3,446 కో ట్ల అభివృద్ధి పనులకు సిఎం మంగళవారం శంకుస్థాప న చేశారు. పరిపాలన, రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు రూ.150 కోట్ల పనులకు సిఎం మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

సిటీలో వరదనీరు ని లవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ.17 కోట్ల అంచనాలతో చేపట్టే ప నులను సిఎం ప్రారంభించారు. హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) సిఎం ప్రారంభించారు. రూ.669 కోట్ల అంచనాలతో ప్రభుత్వం దా నిని చేపట్టింది. తాగునీటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను సిఎం ప్రారంభించారు. హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్డీసిఎల్) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1,500 కోట్లతో రోడ్ల ను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు సిఎం శంకు స్థాపన చేశారు. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌న్ బిల్డింగ్ అప్రూవల్, లే ఔట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను సిఎం లాంఛనంగా ప్రారంభించారు. 2025, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News