- Advertisement -
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సిఎం రేవంత్ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడిన సిఎం రేవంత్.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు మా ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారన్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటుతో కల సాకారమైందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని విమర్శించారు.
సచివాలయాని అమరవీరుల స్థూపానికి మధ్యలో దేశం కోసం అమరులైన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలని చెప్పారు. కొంత మంది వ్యక్తులు ఆ స్థలంలో వాళ్ల విగ్రహం పెట్టుకోవాలని చూస్తున్నారు.. అందుకే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నామని సిఎం అన్నారు.
- Advertisement -