Sunday, December 22, 2024

14 సీట్లు ఇవ్వండి.. ముదిరాజ్ ను మంత్రి చేస్తా: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ నిర్లక్ష్యానికి ముదిరాజ్ లు నష్టపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని సిఎం రేవంత్ మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ లో ముదిరాజ్ బిడ్డకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని అన్నారు. కెసిఆర్ ఒక్క టికెట్ అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ను వంద మీటర్ల గోతిలో పాతిపెట్టారు. ఇప్పుడు మరో ముదిరాజ్ బిడ్డ నీలం మధుకు మెదక్ లో టికెట్ ఇచ్చామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 14 స్థానాల ఇవ్వండి.. ముదిరాజ్ బిడ్డను మంత్రి చేస్తా సిఎం హామీ ఇచ్చారు. ముదిరాజ్ లకు ముదిరాజ్ లను బిసి-డి నుంచి బిసి-ఎకు మార్చాలంటే కాంగ్రెస్ గెలవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News