Monday, January 20, 2025

మోడీని ఓడించి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి: సీఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కార్యకర్తల బూత్ లెవల్ సమావేశ సభ నిర్వహించారు. ఈ సంరద్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. తనకు పదవి, హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవే అని చెప్పారు. 18ఏళ్ల యువత ఈరోజు ఓటు వేస్తున్నారంటే దానికి కారణం.. రాజీవ్ గాంధీ.. ఆయన వీరమరణం పొందినా.. సోనియా గాంధీ జనం కోసం ముందుకొచ్చారని చెప్పారు.

సంక్షభంలో ఉన్న దేశానికి సోనియా గాంధీ స్థిరత్వాన్ని తీసుకొచ్చారని సీఎం అన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పదవులు చేపట్టే అవకాశం వచ్చినా.. సోనియా గాంధీ తీసుకోలేదన్నారు. ఎన్నో పదవులను ఆమె త్యాగం చేశారని అన్నారు. గాంధీ కుటుంబానికి సొంత ఇళ్లు కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఎలాగైతే కష్టపడి పార్టీని గెలిపించామో.. లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించాలని చెప్పారు. మోడీని ఓడించి.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News